IPL 2020: ఒక్క‌ వికెట్ కోల్పోకుండా.. ముంబై పై చేయి

IPL 2020: ఒక్క‌ వికెట్ కోల్పోకుండా.. ముంబై పై చేయి
x
Highlights

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య జ‌రిగిన పోరులో ముంబై పై చేయి సాధించింది.

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య జ‌రిగిన పోరులో ముంబై పై చేయి సాధించింది. చెన్నై నిర్ధేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ రికార్డులను చేరిపి వేస్తూ.. ఒక్క వికెట్ కూడా ప‌డ‌కుండా.. ఓపెనర్లే జట్టుకు గెలుపు అందించారు.

ఓపెనర్లు ఇషాన్ కిషన్, డికాక్ లు.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చెమ‌ట‌లు పట్టించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దొరికినా ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించారు. ముఖ్యంగా యువ ఆట‌గాడు ఇషన్ కిషన్ ఏ మాత్రం తడబడకుండా.. ఆడుతూ పాడుతూ.. భారీ షాట్లూ కొడుతూ.. జట్టుకు భారీ విజయంలో కీల‌క పాత్ర పోషించాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఇక క్వింటాన్ డీకాక్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు వీర‌వీహారం చేయడంతో ముంబై విజయం లాంఛనమైంది.

తొలుత బ్యాటింగ్ వ‌చ్చిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. చెన్నైబ్యాట్ మెన్స్ కి ముంబాయి బౌల‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. తొలి ఓవ‌ర్ నుంచే చెన్నై ప‌తానాన్నిశాసిస్తున్నారు. ప‌వ‌ర్ ఫ్లేలోనే కీల‌కమైన వికెట్లు కోల్పోవ‌డంతో పీకల లోతు క‌ష్టాల్లోకి ప‌డిపోయింది చెన్నై. 20 ఓవర్లు ఆడి 114/9 పరుగులకే పరిమితమైంది. సామ్‌ కరన్‌ (52; 47 బంతుల్లో 4×4, 2×6) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. జ‌ట్టు చెప్పుకోద‌గ్గ స్కోర్ చేయాడానికి కార‌ణ‌మయ్యాడు. ఈ విజ‌యంతో ముంబాయి 14 పాయింట్లు సాధించి, మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో ముంబయి అగ్రస్థానానికి చేరుకోగా, చెన్నై (6 పాయింట్లు) అట్టడుగున నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories