IPL 2020: డివిలియ‌ర్స్‌ విధ్వంసం

IPL 2020: డివిలియ‌ర్స్‌ విధ్వంసం
x

IPL 2020: డివిలియ‌ర్స్‌ విధ్వంసం 

Highlights

IPL 2020: కోల్‌కతా , బెంగళూరు మధ్య షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగ‌ళూర్ సేన రాయ‌ల్ విక్ట‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు.

IPL 2020: కోల్‌కతా , బెంగళూరు మధ్య షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగ‌ళూర్ సేన రాయ‌ల్ విక్ట‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా.. చెల‌రేగాడు. పిచ్ స్లోగా కనిపించినా.. డివిలియర్స్ విధ్వంస‌క రీతిలో రెచ్చిపోయాడు. ప్ర‌త్యర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

ఈ మ్యాచ్ లో 13వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ త‌న భారీ హిట్టింగ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవ‌లం 33 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సుల‌తో 73 ప‌రుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 16 వ ఓవ‌ర్ నుంచి త‌న బాదుడు ప్రారంభించాడు.

నాగర్‌కోటి బౌలింగ్ చేసిన ఈ ఓవ‌ర్‌లో ఏబీ డివిలియర్స్ వరుసగా రెండు బంతుల్ని సిక్సర్ల రూపంలో స్టేడియం వెలుపలికి తరలించేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని షార్ట్ లెంగ్త్ రూపంలో నాగర్‌కోటి విసరగా.. మిడ్ వికెట్‌ దిశగా 85 మీటర్లు సిక్స్ బాదిన ఏబీడీ.. తర్వాత బంతిని యార్కర్ రూపంలో సంధించడంతో ఈసారి బంతిని ఏకంగా 86 మీటర్ల దూరం పడేలా హిట్ చేసేశాడు.

ఎక్కువ ఎత్తు గాల్లోకి లేచిన బంతి స్టేడియం వెలుపల రోడ్డుపై వెళ్తున్న కారుని త‌గిలింది. ఆ త‌రువాత పాట్ కమిన్స్‌కీ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు బాదుడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్‌కీ చుక్కలు చూపించాడు. మొత్తంగా.. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై ఏబీ డివిలియర్స్ కొట్టిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవగా.. కోల్‌కతా హిట్టర్లు కనీసం స్టాండ్స్‌లోకి కూడా బంతిని కొట్టలేకపోవడం గమనార్హం.


Show Full Article
Print Article
Next Story
More Stories