IPL 2020: కోల్‌కతాపై బెంగళూరు 'రాయ‌ల్ విక్ట‌రీ'

IPL 2020: కోల్‌కతాపై బెంగళూరు రాయ‌ల్ విక్ట‌రీ
x
Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 లో మరోసారి విరాట్ సేన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడింది.

IPL 2020: ఐపీఎల్ 2020 లో మరోసారి విరాట్ సేన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరు. తొలుత బ్యాటింగ్ చేసినా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెంగ‌ళూర్ బౌల‌ర్ల ధాటికి కోల్ క‌తా బ్యాటింగ్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. కోల్‌క‌తా ఆట‌గాళ్లంద‌రూ ఒక్క‌రి త‌రువాత ఒక్క‌రూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి, కేవలం 84 పరుగులే చేసింది. అనంతరం బరిలోకి దిగిన బెంగళూరు 13.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.

కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మోర్గాన్ త‌ప్ప‌ ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో మోర్గాన్ 30 పరుగులు చేసి జట్టును ఆదుకునే యత్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సహకారం లభించలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ విజృంభించారు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అలాగే చాహల్ 2 వికెట్లు తీయగా, సైనీ, వాషింగ్టన్ సుందర్‌లకు చెరొక వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో పడిక్కల్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేయగా, గుర్‌కీరత్ సింగ్ 26 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గుసన్‌కు ఒక వికెట్ దక్కింది. మరొక వికెట్ రనౌట్ రూపంలో లభించింది .ఈ విజయంతో బెంగ‌ళూర్ 14 పాయింట్లు సాధించి, ఏకంగా రెండో స్థానంలోకి వెళ్లింది.



Show Full Article
Print Article
Next Story
More Stories