రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆశ తీరేలా లేదు..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆశ తీరేలా లేదు..
x
Highlights

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ సాధిద్దామన్న ఆశ బెంగుళూరుకు తీరేలా కనిపించడం...

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ సాధిద్దామన్న ఆశ బెంగుళూరుకు తీరేలా కనిపించడం లేదు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది.ఓపెనర్లు డి కాక్ (23), రోహిత్ శర్మ(48) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ చక్కగా క్రీజులో కుదురుకున్న తరుణంలో యజువేంద్ర చాహల్ డి కాక్ ను బౌల్డ్ చేశాడు. ఆ తరువాత రోహిత్ శర్మ కూడా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(38), యువరాజ్ సింగ్(23) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కూడా చాహల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యారు.

ఆ తరువాత హార్దిక్ పాండ్య(32) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. దీంతో ముంబై జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఏబీ డివిలియర్స్‌ (41 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (32 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. పార్థివ్ పటేల్ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లలో ఎవరూ పెద్ద ఆకట్టుకోలేక పోయారు. దీంతో బెంగుళూరు జట్టు అపజయాల పరంపర కొనసాగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories