Interesting Facts About Dhoni : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు
Interesting Facts About Dhoni : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న (ఆగస్టు 15)న తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.. ఇక కేవలం ధోని ఐపీఎల్ లో మాత్రమే ధోని ఆడనున్నాడు.
జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిన ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
★ ధోని తన ఫస్ట్ వన్డే మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో డిసెంబరు 2004 లో ఆడాడు. ఒక సంవత్సరం తరువాత శ్రీలంకతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు...
★ 2005లో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 148 రన్స్ చేసి అదరగొట్టాడు.. ధోనికి ఇది అయిదో మ్యాచ్ కావడం విశేషం..
★ ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 183 రన్స్ ఛేజ్ చేసి... ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్స్‌లో ఒకడిగా నిలిచాడు.
★ హెలికాప్టర్ షాట్ అంటే ధోని.. ధోని అంటేనే హెలికాప్టర్ షాట్..
★ క్రికెట్ లోకి వచ్చిన మూడేళ్లకే కెప్టెన్ అయ్యాడు..2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు ధోని.
★ 2007 సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీం ఇండియా కుర్ర జట్టుకు కూల్ గా కెప్టెన్ గా వ్యవహరిస్తూ కప్ ని సాధించి పెట్టాడు ధోని.
★ గెలుపులోనే కాదు ఓటమిలో కూడా సహనాన్ని కోల్పోకుండా ఉంటూ కెప్టెన్ కి కొత్త అర్ధం చెప్పాడు ధోని.
★ 2009లో ధోనీ మొదటి సారి భారత్ జట్టును ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలబెట్టాడు..
★ 2013 లో ధోని కెప్టెన్సీ లోని భారత్ 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్ లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది.
★ ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వంటీ 20 గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు..
★ ధోని కెప్టెన్సీ లో భారత్ 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లను గెలుచుకుంది.
★ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కెప్టెన్ గా వ్యవహరించి మూడు ట్రోఫీ లను సొంతం చేసుకున్నాడు..
★ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 4876 రన్స్ చేశాడు. ఇక 350 వన్డేల్లో 10773 రన్స్ చేశాడు. అటు 98 టీ20లు ఆడి 1617 రన్స్ చేశాడు.
★ ధోనికి బైక్స్, కార్లు అంటే పిచ్చి.. మ్యాచ్ లు అయిపోయాక మైదానంలో బైక్, కార్లపై తిరిగిన సందర్బాలు చాలానే ఉన్నాయి.. ఫెరారీ, ఆడి లాంటి విలాసవంతమైన కార్లు.. కవాసకి నింజా హెచ్2, హార్లీ డేవిడ్‌సన్ లాంటి ఖరీదైన బైక్‌లు అతని దగ్గరున్నాయి.
★ ధోని పైన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.. బహుశా ఓ క్రికెటర్ పైన బయోపిక్ తెరకెక్కడం ఇదే మొదటిది.. ఇందులో దోనిగా బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కనిపించాడు. అప్పుడే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. దాదాపు 50కి పైగా దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ధోనీ గురించి తెలియవారికి సైతం తెలిసేలా చేసింది. ఇక సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ధోని ఎంతో బాధపడ్డాడని సన్నిహితులు చెబుతారు.
★ తన పవర్ హిట్టింగ్‌తో పాకిస్థాన్ ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నాడు ధోని.
★ ధోనికి బిర్యానీని చాలా ఇష్టం..
★ ఇక ధోని, సాక్షి చిన్నప్పటి మంచి ఫ్రెండ్స్.. ఆ తర్వాత సాక్షి కుటుంబం ఝార్ఖండ్ నుంచి డెహ్రాడూన్ వెళ్ళడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తరవాత కోల్‌కతాలోని ఓ హోటల్లో అనుకోకుండా కలిశారు. అక్కడినుంచి వారి మధ్య ప్రేమ మొదలై పెళ్ళికి దారి తీసింది.
★ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. పారా జంప్ చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు.
★ జులపాల జుట్టుతో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ ఆ తర్వాత ఎన్నో హెయిర్ స్టయిల్స్‌ని మారుస్తూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఏకంగా ధోనీ హెయిర్ స్టైల్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ సైతం ముగ్ధుడయ్యాడు.
★ ధోనీ కి కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువ. మైదానంలోనూ చాలా కూల్‌గా ఉంటాడు. ఎలాంటి పరిస్థితులనైనా కూల్‌గా ఉంటూనే చక్కబెట్టేస్తాడు. అందుకే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు.
★ హెలికాఫ్టర్ షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన తొలి ఆటగాడు ధోనినే...
★ ప్రపంచ కప్‌లో ధోనీ కొట్టిన ఆ సిక్సర్ భారత క్రీడాభిమానులకు ఎప్పటికీ ఒక మధుర స్మృతిగానే మిగిలిపోనుంది.
★ ధోనికి క్రికెట్ తో పాటుగా ఫుట్‌బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire