కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన భారత రెజ్లర్లు

Indian Wrestlers Have Shown their Strength in the Commonwealth Games
x

కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన భారత రెజ్లర్లు

Highlights

Commonwealth Games 2022: మొత్తం తొమ్మిది స్వర్ణపతకాలు దక్కించుకున్న భారత్

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. భారత్ మొత్తం తొమ్మిది స్వర్ణ పతకాలు దక్కించుకుంది. స్టార్ రెజ్లర్ దీపక్ పునియా, మహిళల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 62 కేజీల విభాగంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మాలిక్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా ఫైనల్స్ లో కెనెడా యువ రెజ్లర్ మెక్ నీల్ పై సునాయస విజయం సాధించాడు. మొదటి నుంచి ప్రత్యర్ధులను చిత్తు చేసుకుంటూ వచ్చిన బజరంగ్ పునియా ఫైనల్స్ లో ఆధిపత్యం చెలాయించాడు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణ పతాకాన్ని తనఖాతోలో వేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్‌ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా కెనడాకు చెందిన లాచలాన్ మెక్‌నీల్‌ను ఫైనల్‌లో 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు.

సాక్షిమాలిక్ మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో ఫైనల్స్ లో కెనాడకు చెందిన అనా గోడినెజ్ ను మట్టికరిపించింది. 2014 క్రీడల్లో సాక్షి మాలిక్ రజతం, 2018లో కాంస్య సాధించగా తాజాగా స్వర్ణ పతక విజేతగా నిలిచింది. కామన్వెల్త్ రెజ్లింగ్ ప్రారంభం రోజున క్వార్టర్ ఫైనల్ ఔట్ తో ప్రచారం పొందిన సాక్షిమాలిక్ పొడియం ముగింపులో అగ్రస్థలానంలో నిలిచేందుకు తన ప్రత్యర్ధులను వెనక్కి నెట్టింది. రియో ఒలింపిక్స్ లో కాంస్య పతాకాన్ని కైవసం చేసుకున్న సాక్షి మాలిక్..నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి బంగారు పతకంతో ఛాంపియన్ గా నిలిచింది. మొదటి సారిగా స్వర్ణాన్ని గెలుచుకుంది.

పారా పవర్ లిఫ్టింగ్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించాడు గోల్డెన్ పారా పవర్ లిఫ్టర్ సుధీర్. పురుషుల హెవీవెయిట్ విభాగంలో 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన సుధీర్ ఈ ఈవెంట్ లో భారత్ కు మొదటి పతకం అందించాడు. 212 కిలోలు ఎత్తిన సుధీర్ పొలియో బాధితుడు. అయినా అతని ఆత్మ విశ్వాసాన్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. హరియాణకు చెందిన సుదీర్ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయస్సులోనే తీవ్రజ్వరంతో పోలియో భారీన పడ్డాడు. అప్పటి నుంచి ఆటలంటే అమితాసక్తి కనబరుస్తుండే వాడు. ప్రస్తుతం అతని వయస్సు 28 ఏల్లుద. తన జీవితాశయాన్ని మాత్రం వదులుకోకుండా పవర్ లిఫ్టింగ్‌పై క్రమంగా ఆసక్తి పెంచుకున్నాడు. 2013 లో పవర్ లిఫ్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. 2016లో మొదటి జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. రెండు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేశాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ 2022లో మొదటి ప్రయత్నంలోనే 208 కిలోలు ఎత్తి రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తి 134.5 పాయింట్లు సాధించి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు బద్దలు కొట్టాడు.

మరో భారత రెజ్లర్ అన్షుమాలిక్ మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రజతం కైవసం చేసుకుంది, తుదిపోరులో నైజీరియా రెజ్లర్ ఒడినాయో ఫాలెసాడే అడికురో చేతిలో 4-6 తేడాతో ఓటమి పాలైంది. కామన్వెల్త్ క్రీడల్లో అన్షు మాలిక్ తొలిపతంగా రజతాన్ని సొంతం చేసుకుంది. వరుస బౌట్లలో చెలరేగి ఫైనల్ కు చేరిన అన్షు కీలక పోరులో తడబడింది. చివరగా తన పోరాటంతో అన్షు రెజ్లింగ్ అభిమానుల మనసులు గెలిచింది. 68 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో భారత , క్రీడాకారిణి దివ్య కక్రాన్ కాంస్య పతకం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories