Mohmmed Siraj: 2019లో రూ. 25 కోట్లు.. డీఎస్పీ సిరాజ్ ప్రస్తుత నెట్‌వర్త్ ఎంతో తెలుసా?

Mohmmed Siraj: 2019లో రూ. 25 కోట్లు.. డీఎస్పీ సిరాజ్ ప్రస్తుత నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
x

Mohmmed Siraj: 2019లో రూ. 25 కోట్లు.. డీఎస్పీ సిరాజ్ ప్రస్తుత నెట్‌వర్త్ ఎంతో తెలుసా?

Highlights

Mohmmed Siraj Net Worth: ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం వార్తల్లో మార్మోగిపోతున్నాడు. తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా సిరాజ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Mohmmed Siraj Net Worth: ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరు ప్రస్తుతం వార్తల్లో మార్మోగిపోతున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా సిరాజ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ భారత ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్.. కష్టపడి, అంకితభావంతో ప్రస్తుతం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.. అతని నికర విలువ అంతకంతకు పెరుగుతోంది. క్రికెట్‌తో పాటు అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు డీఎస్పీగా కూడా జీతం తీసుకోనున్నారు. ఇటీవల భారత్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.. CAknowledge.com వెబ్‌సైట్ ప్రకారం 2024లో సిరాజ్ నికర విలువ దాదాపు 7 మిలియన్ డాలర్లు అంటే 55 కోట్లు. క్రికెట్‌తో పాటు ప్రకటనల ద్వారా కూడా సిరాజ్ చాలా సంపాదిస్తున్నారు. సిరాజ్ కష్టానికి తగ్గ ఫలితమే నేడు కోట్లకు పడగలెత్తుతోంది. ప్రతి మ్యాచ్‌లో సిరాజ్ టీమ్ ఇండియాలో తన ప్రభావాన్ని పెంచుకోవడమే కాకుండా, ప్రతి ఫార్మాట్‌లో ప్రధాన బౌలర్‌గా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశాడు. మహామహులు చేరుకోవడానికి ఏళ్లు పట్టే స్థాయికి సిరాజ్ అనతికాలంలోనే చేరుకున్నారు. గతేడాది ఆసియాకప్ ఫైనల్‌లో శ్రీలంకపై తన ప్రాణాంతక బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. ఒక్కడే ఆరుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

సిరాజ్ హైదరాబాద్‌లోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. 30 ఏళ్ల వయసులో సిరాజ్ తన బౌలింగ్ నైపుణ్యంతో క్రీడా ప్రపంచంలో ఎంతో పేరు, డబ్బు సంపాదిస్తున్నాడు. సిరాజ్ తండ్రి ఆటో నడుపుతుండగా, తల్లి ఇతరుల ఇళ్లలో పనిచేస్తుండేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సిరాజ్.. టీమ్ ఇండియాకు ఆడాలని కలలు కన్నాడు. తన కఠోర శ్రమతో దానిని నిజం చేసుకున్నాడు. 2024లో సిరాజ్ నెలవారీ ఆదాయం రూ. 60 లక్షల కంటే ఎక్కువగా ఉంది. అతను ఏటా దాదాపు రూ. 8 కోట్లు సంపాదిస్తున్నారు.

మహ్మద్ సిరాజ్ 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఐపీఎల్‌లో తొలి కాంట్రాక్ట్‌ను పొందాడు. ప్రస్తుతం, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఒక భాగంగా ఉన్నాడు. అక్కడ అతను ఏటా రూ. 7 కోట్లు పొందుతాడు. సిరాజ్ 2018 నుంచి ఇప్పటి వరకు RCB జట్టులో ఉన్నాడు. జట్టు 2019, 2020, 2022లో సిరాజ్‌ను నిలబెట్టుకుంది.

వెబ్‌సైట్ ప్రకారం సిరాజ్ నికర విలువ 2019లో రూ. 3 మిలియన్లు. ఇది 2020లో రూ. 3.5 మిలియన్లకు పెరిగింది. అయితే 2021లో అది రూ. నాలుగు మిలియన్లకు పెరిగింది. ఇక 2022లో సిరాజ్ 5 మిలియన్లకు యజమాని అయ్యారు. 2023లో అతని నికర విలువ 6 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం సిరాజ్ ఆస్తుల విలువ దాదాపు రూ.7 మిలియన్లు.

మహ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ గ్రేడ్ 'బి' కాంట్రాక్ట్‌లో చేర్చారు. దీని కింద అతనికి ఏటా రూ.3 కోట్లు వస్తున్నాయి. దీంతో పాటు ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.3 లక్షలు ఫీజుగా అందుకుంటారు.

సిరాజ్ ప్రస్తుతం ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం, గేమ్స్ 24X7 ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫారమ్ MY11 సర్కిల్ అతనిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. దీంతో పాటు మరికొన్ని బ్రాండ్‌లకు ప్రకటనలు కూడా చేస్తున్నాడు.మహ్మద్ సిరాజ్ గతేడాది కొత్త ఇల్లు కొన్నాడు. గత IPL సీజన్‌లో, అతను తన కొత్త ఇంట్లో తన RCB సహచరులను విందుకు ఆహ్వానించాడు. సిరాజ్ కుటుంబంలో తల్లితో పాటు అన్నయ్య కూడా ఉన్నాడు. క్రికెట్‌లో ఇప్పటి వరకు సిరాజ్ ఏం సాధించినా.. ఆ క్రెడిట్‌ను తన దివంగత తండ్రికే అందజేస్తాడు.

సిరాజ్ తన గ్యారేజీలో కార్ల స్టాక్‌ను కలిగి ఉన్నాడు. BMW 5 సిరీస్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా థార్, టయోటా కరోలా వంటి కార్లు అతని గ్యారేజ్ అందాన్ని పెంచుతున్నాయి. 2021 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్టులో సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో సంతోషించిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అతనికి మహీంద్రా థార్‌ను బహుమతిగా ఇచ్చాడు. సిరాజ్ 2021లో బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories