Harbhajan Singh Shocked By Electricity Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి.
Harbhajan Singh Shocked By Electricity Bill: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే పరిస్థితిని ఎదురుకుంటున్నారు.. తాజాగా ఇండియన్ వెటరన్ క్రికెటర్ ,చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అవాక్కయ్యాడు.
వాస్తవానికి తానూ కట్టే కరెంట్ బిల్లు కంటే ఏడింతలు ఎక్కువగా వచ్చిందని వాపోయాడు భజ్జీ.. భజ్జీ ఉంటున్న నివాసానికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. అయితే ఈ నెల మొత్తం రూ.33,900 బాకీ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. దీనితో కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు హర్భజన్.. అయితే తన చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ట్విట్టర్ వేదికగా ఎలక్ట్రిసిటీ బోర్డును ప్రశ్నించాడు భజ్జీ ..
Itna Bill pure mohalle ka lga diya kya ?? @Adani_Elec_Mum 😳😳😳ALERT: Your Adani Electricity Mumbai Limited Bill for 152857575 of Rs. 33900.00 is due on 17-Aug-2020. To pay, login to Net/Mobile Banking>BillPay normal Bill se 7 time jyada ??? Wah
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 26, 2020
ఇక ఇంతకుముందు హీరోయిన్ తాప్సీ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏకంగా రూ.36 వేల బిల్లు ఇచ్చారని ట్విట్టర్ వేదికగా అధికారులను నిలదీసింది. లాక్‌డౌన్ వేళ ఇలాంటి సంఘటనలు చాలా చోట్లలో చోటుచేసుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ వలన గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి మెుదలుకానుంది. అన్ని జట్లు అక్కడ వెళ్ళడానికి సిద్దమవుతున్నాయి. త్వరలో అక్కడికి వెళ్ళడానికి సిద్దం అవుతున్నాడు హర్భజన్ సింగ్ !
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire