Team India: ఆరుగురు ఆటగాళ్లు.. ఓవర్‌కి 8 బంతులు.. ఇదెక్కడి వింత రూల్స్‌ టోర్నీ భయ్యా.. బరిలోకి టీమిండియా

Indian Cricket Team may Playing in Hong Kong Cricket Sixes Tournament Check Full Details
x

Team India: ఆరుగురు ఆటగాళ్లు.. ఓవర్‌కి 8 బంతులు.. ఇదెక్కడి వింత రూల్స్‌ టోర్నీ భయ్యా.. బరిలోకి టీమిండియా

Highlights

ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 3 వరకు జరిగే హాంకాంగ్ క్రికెట్ సిక్స్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్ సిద్ధమైంది.

Indian Cricket Team Hong Kong Cricket Sixes Tournament: ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 3 వరకు జరిగే హాంకాంగ్ క్రికెట్ సిక్స్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్ సిద్ధమైంది. 1992లో ప్రారంభమైన ఈ టోర్నీ 2017 వరకు జరిగింది. ఇప్పుడు ఈ టోర్నీ 7 ఏళ్ల తర్వాత మళ్లీ రాబోతోంది. 2005లో ఒకసారి భారత్ ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఇది కాకుండా 1996లో టీమ్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి జట్లతో తలపడేందుకు సిద్ధమైంది.

క్రికెట్ హాంకాంగ్ ప్రకటన..

టోర్నీలో భారత జట్టు భాగస్వామ్యాన్ని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన 'ఎక్స్' ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. “టీమ్ ఇండియా HK6లో సిక్సర్లు కొట్టడానికి సిద్ధంగా ఉంది! అభిమానులను ఆశ్చర్యపరిచే తుఫాన్ పవర్ హిట్టింగ్, సిక్సర్ల తుఫాను ఉంటుంది. మరిన్ని జట్లు, మరిన్ని సిక్సర్లు, మరింత ఉత్సాహం, మస్త్ థ్రిల్‌ ఉంటుంది. HK6 1వ తేదీ నుంచి 3 నవంబర్ 2024 వరకు తిరిగి వచ్చింది" అంటూ వచ్చిందంటూ ట్వీట్ చేసింది.

ఏయే జట్లు పాల్గొంటున్నాయంటే..

20వ ఎడిషన్ టోర్నీ 12 జట్ల మధ్య జరగనుంది. ఇది టిన్ క్వాంగ్ రోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, హాంకాంగ్, నేపాల్, న్యూజిలాండ్, ఒమన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్లు ఉన్నాయి. బ్రియాన్ లారా, వసీం అక్రమ్, షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు గతంలో ఈ టోర్నీలో ఆడారు. 2005లో భారత్ టోర్నీని గెలుచుకోగా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా 5 టైటిల్స్‌తో అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి.

టోర్నమెంట్‌లో విచిత్రమైన రూల్స్..

టోర్నమెంట్‌లో ఇతర మునుపటి విజేతలలో పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఉన్నాయి. టోర్నీ ఫార్మాట్ సరదాగా ఉంటుంది. ఆరుగురు ఆటగాళ్లతో కూడిన రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో జట్టుకు గరిష్టంగా ఐదు ఓవర్లు ఉంటాయి. ఐదు ఓవర్లు వేస్తారు. ప్రతి ఓవర్‌లో ఆరు బదులు ఎనిమిది బంతులు వేయవచ్చు. వికెట్ కీపర్ తప్ప, ఫీల్డింగ్ జట్టులోని ప్రతి ఆటగాడు ఒక్కో ఓవర్ వేయాలి. వైడ్, నో బాల్‌లో ఒకటి కాదు 2 పరుగులు ఇస్తారు. ఒక బ్యాట్స్‌మన్ 31 పరుగులు చేసిన తర్వాత రిటైర్ అవ్వాలి. తమ జట్టు వికెట్లన్నీ పడిపోయిన తర్వాత వారు తిరిగి బ్యాటింగ్‌కు రావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories