IND VS SL: కాసేపట్లో భారత్ శ్రీలంక మధ్య ఫైనల్ పోరు..జట్ల బలబలాలు ఇవే..

IND VS SL: కాసేపట్లో భారత్ శ్రీలంక మధ్య ఫైనల్ పోరు..జట్ల బలబలాలు ఇవే..
x
Highlights

భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చిట్టచివరి మ్యాచ్ పుణె వేదికగా శుక్రవారం ప్రారంభంకానుంది.

భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చిట్టచివరి మ్యాచ్ పుణె వేదికగా శుక్రవారం ప్రారంభంకానుంది. నిర్ణయాత్మక పోరులో శ్రీలంకను సొంతగడ్డపై మట్టికరిపించి 2–0తో సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ సమం చేసిన పరువు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అయితే శ్రీలంక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను గెలవడం, సిరీస్‌ను సమం చేయడం శ్రీలంకకు అంత తేలికైన పని కాదు.

ఈ మ్యాచ్ లో గెలిచి 2020కి ఘనమైన ఆరంభం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో శ్రీలంక తేలిపోయింది. అసలు ఏ మాత్రం పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. దీంతో లంకపై భారత్‌ ఆడుతూ పాడుతూ శ్రీలంక నిర్ధేశించిన లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ లోనూ, ఫిల్డింగ్ లోనూ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించింది.

గువహటిలో మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయినా, భారత్ రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో భారత్ జట్టు బరిలోకి దిగుతుంటే. ఇక ప్రత్యర్థి శ్రీలంక మాత్రం వరుస ఓటములతో ఒత్తిడి ఎదుర్కొంటుంది. మ్యాచ్ కు ముందుగానే రెండో టీ20లో గాయపడిన ఇరుసు ఉదానా గాయం కారణంగా మ్యాచ్ దూరమవ్వడం శ్రీలంకకు పెద్ద ఎదురు దెబ్బే. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. ఒక వేల మలింగసేన ముందు బ్యాటింగ్ చేస్తే తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసే అవకాశం ఉంది. మ్యాచ్ విజయం కంటే మంచి పోరాటపఠిమతోనైనా ఆకట్టుకోవాలని శ్రీలంక భావిస్తుంది.

భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. భీకర ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఈ మ్యాచ్ లోను అదే ఫామ్ కొనసాగిస్తే భారత్ ను అడ్డుకోవడం శ్రీలంకకు కఠిన పరీక్షే. జట్టులో స్థానం దక్కించుకున్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌ రాణిస్తే ఓకే టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ నుంచి ముప్పు పొంచి ఉంది. రోహిత్ విశ్రాంతి ఇవ్వడంతో ధావన్ కు జట్టులో అవకాశం సెలక్షన్ కమిటీ కాల్పించింది. ధావన్ భారీ స్కోరు సాధిస్తే అతని స్థానం పదిలమనే చెప్పాలి. ధావన్ ఈ మ్యాచ్ ఎదురుదాడికి దిగితే అటూ రాహుల్, ఇటూ ధావన్ ఇద్ధరని నిలువరించడం లంకు కష్టమే. కెప్టెన్‌ విరాట్ కోహ్లి, శ్రేయస్స్ అయ్యార్, వికెట్ కీరపర్ రిషబ్ పంత్ ఇలా భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

సినీయర్ బౌలర్ షమీ విశ్రాంతి ఇచ్చిన సెలక్టెర్లు ఈ సారి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించారు. దీంతో ఇండోర్ జరిగిన మ్యాచ్ లో శార్దుల్‌ ఠాకూర్ వరుస వికెట్లతో అదరగొట్టారు. వెస్టిండీస్ పర్యటనతో టీమిండియాలోకి ఆరంగేట్రం చేసిన నవ్‌దీప్‌సైనీ శ్రీలంకతో జరుగుతున్న పోరులో కూడా చక్కగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్ తో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన కుల్దీప్, వాషింగ్టన్‌ సుందర్‌లనే ఈ మ్యాచ్ లో కొనసాగించే అవకాశాలున్నాయి. జట్టులో మార్పులు చేయకపోతే ఈ మ్యాచ్‌లోనూ రవీంద్ర జడేజా, చహల్‌ డగౌట్ కే పరిమితం అవుతారు.

మరోవైపు ప్రత్యర్థి శ్రీలంక జట్టు బలహీనంగా ఉంది. ముఖ్యంగా అనుభవలేమి బ్యాటింగ్, బౌలింగ్ శ్రీలంకను వేదిస్తుంది. జట్టులో కీలక ఆటగాళ్లు సినియర్ ప్లేయర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు మాథ్యూస్‌ ,మరోకరు కెప్టెన్, పేసర్‌ మలింగ. కుశాల్‌ పెరీరా, డిక్‌వెలా, ధనంజయ డిసిల్వా లాంటి ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. రెండో మ్యాచ్ లో అనూహ్యంగా మ్యాథ్యూస్ ను దూరం పెట్టిన లంక. ఈ మ్యాచ్‌లో ఉదానా లేకపోవడంతో మ్యాథ్యుస్ ఆడించే అవకాలు ఉన్నాయి. దీంతో శ్రీలంక కనీస పోరాటపఠిమ చూపించి పరువు దక్కించుకోవాలని చూస్తుంది.

పిచ్ విషయానికి వస్తే.. పిచ్ మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ కు సమాన అవకాశాలు ఉన్నాయి. మంచు ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంతో రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ కఠినంగా మారొచ్చు.

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్ ,సందీప్ షైనీ, శార్దుల్, బుమ్రా.

శ్రీలంక: లతీస్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్సా, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌/లహిరు కుమార, షనక, హసరంగ, కసున్‌ రజిత.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories