ఇండియా..న్యూజిలాండ్..వాన! 'ముక్కోణపు' పోటీ!

ఇండియా..న్యూజిలాండ్..వాన! ముక్కోణపు పోటీ!
x
Highlights

కోరుకున్న ప్రత్యర్ధితో నాకౌట్ మ్యాచ్. ఆడుతూ..పాడుతూ ఫైనల్ కి వెళ్లిపోవచ్చు అనుకుకున్న టీమిండియాకు మరో ప్రత్యర్థి వర్షం రూపంలో ఎదురైంది. మొదట్నుంచీ.....

కోరుకున్న ప్రత్యర్ధితో నాకౌట్ మ్యాచ్. ఆడుతూ..పాడుతూ ఫైనల్ కి వెళ్లిపోవచ్చు అనుకుకున్న టీమిండియాకు మరో ప్రత్యర్థి వర్షం రూపంలో ఎదురైంది. మొదట్నుంచీ.. వరల్డ్ కప్ లో పదకొండో జట్టుగా వరుణుడు ఉన్నాడని క్రికెట్ అభిమానులు జోకులేసుకున్నారు. ఇప్పుడు అది నిజం చేస్తూ మొదటి సెమీస్ కు అడ్డు తగిలాడు. వాన రాకుండా ఆట సాగివుంటే టీమిండియాకు టెన్షన్ ఉండేదే కాదు. ఇప్పుడు అర్ధాంతరంగా వాయిదా పడిన మ్యాచ్ తో ఇండియా గెలుపు పరిస్థితి సందిగ్ధంగా మారింది.

ఎందుకంటే.. వర్షం తో అవుట్ ఫీల్డ్ తడిగా ఉంటుంది. దాంతో బంతి నెమ్మదిస్తుంది. ఇక అసలే పిచ్ నెమ్మదిగా ఉంది.. ఇప్పుడు అది బౌలర్లకు నూరుశాతం సహకరిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చెడన అంత సులువు కాకపోవచ్చు. న్యూజిలాండ్ నిన్న పూర్తి ఓవర్లు ఆడినా..240 లోపే స్కోరు చేయగలిగేది. తరువాత ఇండియా హాయిగా లక్ష్యాన్ని చేరుకోగలిగేది. కానీ, వాన సీన్ రివర్స్ చేసింది. ఇప్పుడు పిచ్ పరిస్థితి మారిపోతుంది. బ్యాటింగ్ అంత సులువుగా ముందుకు సాగదు. పైగా బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీ బౌలింగ్ త్రయాన్ని ఇటువంటి పిచ్ మీద కాచుకోవడం చాలా కష్టం. అందులోనూ తొలి ఓవర్లలో బౌల్ట్ మామూలుగానే ముప్పు తిప్పలు పెడతాడు. ఇక పిచ్ నుంచి సహకారం అందిందంటే కచ్చితంగా విరుచుకుపడతాడనడం లో సందేహం లేదు.

సరే, ఇదెలా ఉన్నా.. ఈరోజు ఆట మామూలుగా సాగితే కొంతవరకూ భారత్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఓవర్లను కుదిస్తే అప్పుడు టీమిండియా లక్ష్యం మరింత కఠినంగా మారిపోతుంది. నిన్నటి లెక్క ప్రకారం చూస్తే.. ఓవర్లు కుదిస్తే..46 ఓవర్లలో 237, 40 ఓవర్లలో 223, 35 ఓవర్లలో 209, 30 ఓవర్లలో 192, 25 ఓవర్లలో 172, 20 ఓవర్లలో 148గా భారత్ లక్ష్యం ఉంటుంది. తేమతో నిండిన పిచ్.. తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్ ఉండే పరిస్థితుల్లో ఈ లక్ష్యాల్లో ఏదైనా కష్టసాధ్యమే. అసాధ్యం అనుకున్న చోట టీమిండియా సాధ్యం చేసి చూపించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతుందని ఆశిద్దాం. నల్లేరు మీద నడకలా సాగాల్సిన భారత్ జైత్రయాత్ర ఇటు న్యూజిలాండ్ తోనూ.. అటు వర్షంతోనూ పోరాడాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పడు ఎదురవుతున్న ఈ సవాల్ ను టీమిండియా ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories