WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌‌లో ఫలితం వచ్చే అవకాశం?

India Vs New Zealand WTC Final Match 2021 Live Updates
x

టీం ఇండియా (ఫైల్ ఇమేజ్)

Highlights

WTC Final Match 2021: లంచ్ బ్రేక్ సమయానికి 98 రన్స్ ఆధిక్యంలో భారత్ * బౌలింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న సౌతాంప్టన్ పిచ్

India Vs New Zealand: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఫలితం వస్తుందా లేదా ఉన్న ఉత్కంఠ సాగుతున్న వేళ భారత్ టాప్‌ఆర్డర్ ఢమాల్ అంది. మ్యాచ్ చివరి రోజైన ఇవాళ ఇన్నింగ్స్ ప్రారంభం అయిన కాసేపటికే కెప్టెన్ విరాట్ వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా చెప్పుకునే మరో బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సైతం స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడం టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీసింది. పిచ్ బౌలింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు.. 32 పరుగులు వెనుకబడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిన్నటి చివరి సెషన్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్‌గిల్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఈ క్రమంతో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, ఇవాళ పిచ్ కండిషన్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో సీన్ మారిపోయింది. భారత క్రికెట్ ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్న కోహ్లీ, పుజారా వెనువెంటనే ఔట్ కావడంతో మటీమిండియా మిడిలార్డర్‌పై పెను భారం పడింది. ఇలాంటి సమయంలో రహానేను బౌల్ట్ ఔట్ చేశాడు. ప్రస్తుతం వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ జడేజా క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరి ఆటపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

ఇక.. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మ్యాచ్‌లో రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా రెండు సెషన్ల ఆట ఉండడం.. క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండడంతో మ్యాచ్ ఫలితం పక్కా అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.. మరోవైపు.. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన రిషబ్ పంత్ టీమిండియాలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌తో పోల్చితే కాస్త దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. ఇలాంటి పరిస్థుల్లో టీమిండియా ఊరించే లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే విజయం కోసం న్యూజిలాండ్ పోరాడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయం ఎవరిది అనేది చెప్పడం కష్టమే అయినా.. రిజల్ట్ మాత్రం పక్కా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories