న్యూజిలాండ్ టూర్లో కొహ్లీని ఊరిస్తున్న జంట రికార్డులు

న్యూజిలాండ్ టూర్లో కొహ్లీని ఊరిస్తున్న జంట రికార్డులు
x
Highlights

టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్ తో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పాంచ్ పటాకా...

టీమిండియా కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్ తో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో....కొహ్లీ మరో రెండు సెంచరీలు సాధించగలిగితే....ఇప్పటి వరకూ వీరేంద్ర సెహ్వాగ్ పేరుతో ఉన్న ఆరు సెంచరీల రికార్డు తెరమరుగుకానుంది. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఆరుశతకాలు బాదిన క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఉంటే... మాస్టర్ సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ చెరో ఐదు సెంచరీలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. అంతేకాదు...న్యూజిలాండ్ ప్రత్యర్థిగా సెహ్వాగ్ 23 ఇన్నింగ్స్ లో 1157 పరుగులతో రెండోస్థానంలో ఉంటే...విరాట్ కొహ్లీ...19 ఇన్నింగ్స్ లోనే 1154 పరుగులతో వీరూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అయితే ..న్యూజిలాండ్ పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డు మాత్రం మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే ఉంది. సచిన్ మొత్తం 1750 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ వరకూ...మొత్తం 219 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ...210 ఇన్నింగ్స్ లో 39 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 10వేల 339 పరుగులతో 59.76 సగటు నమోదు చేశాడు. అంతేకాదు...చేజింగ్ లో అత్యధికంగా 21 శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories