IND vs NZ 2nd Test: టీమిండియా టార్గెట్ 359.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కివీస్ ఆలౌట్..

India vs New Zealand Day 3 , 2nd Test New Zealand all out 255 India needs 359 to win in the 2nd test
x

IND vs NZ 2nd Test: టీమిండియా టార్గెట్ 359.. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కివీస్ ఆలౌట్..

Highlights

India vs New Zealand Day 3 , 2nd Test: పుణె టెస్టులో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు 359 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

India vs New Zealand Day 3 , 2nd Test: పుణె టెస్టులో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు 359 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ జట్టు 358 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.

కివీస్ మూడో రోజు 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో ప్రారంభించింది. జట్టు స్కోరు 231 వద్ద ఆరో దెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి కివీస్ జట్టు 24 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయింది. అజాజ్ పటేల్ (1 పరుగు), మిచెల్ సాంట్నర్ (4 పరుగులు), టామ్ బ్లండెల్ (41 పరుగులు)లకు రవీంద్ర జడేజా పెవిలియన్ దారి చూపించాడు. కాగా, టిమ్ సౌథీ (0)ను ఆర్ అశ్విన్ అవుట్ చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. శుక్రవారం టామ్ లాథమ్ 86 పరుగులు చేసి, విల్ యంగ్ (23 పరుగులు), డారిల్ మిచెల్ 18, డెవాన్ కాన్వే 17, రచిన్ రవీంద్ర 9 పరుగులు చేసి ఔట్ అయ్యారు.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ 156 పరుగులకే కుప్పకూలింది. గురువారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకంజలో ఉంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఓ రూర్కే.

Show Full Article
Print Article
Next Story
More Stories