IND vs ENG: డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనున్న భారత్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..!

India vs England Test Series After WTC Final 2025 Check Full Schedule
x

IND vs ENG: డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనున్న భారత్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..!

Highlights

గతేడాది భారత్‌లో ఇరు దేశాల మధ్య 5 టెస్టుల సిరీస్‌ జరిగింది. ఇందులో భారత్ ఏకపక్షంగా 4-1తో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

India vs England Test Series 2025: భారత క్రికెట్ జట్టు 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. జూన్, ఆగస్టు 2025 మధ్య రెండు దేశాలు ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు, బీసీసీఐ గురువారం షెడ్యూల్‌ విడుదల చేశాయి.

2021లో ఇంగ్లండ్‌లో భారత్ చివరి టెస్టు పర్యటన 2-2తో డ్రాగా ముగిసింది. ఆ సమయంలో టీమ్ ఇండియాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా 4 టెస్టుల తర్వాత సిరీస్‌ను నిలిపివేశారు. అప్పుడు భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత, 2022లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.

గతేడాది భారత్‌లో ఇరు దేశాల మధ్య 5 టెస్టుల సిరీస్‌ జరిగింది. ఇందులో భారత్ ఏకపక్షంగా 4-1తో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 పూర్తి షెడ్యూల్..

మొదటి టెస్ట్ - జూన్ 20-24, 2025 - హెడింగ్లీ, లీడ్స్

రెండవ టెస్ట్ - జూలై 2-6, 2025 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

మూడవ టెస్ట్ - జూలై 10-14, 2025 - లార్డ్స్

నాల్గవ టెస్ట్ - జూలై 23-27, 2025 - ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

ఐదవ టెస్ట్ - జూలై 31-ఆగస్టు 4, 2025 - ది ఓవల్

ఐదు మ్యాచ్‌ల టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు 2025లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది.

ఇంగ్లండ్ మహిళల వర్సెస్ భారత్ టీ20 సిరీస్

1వ టీ20: జూన్ 28-ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్

2వ టీ20: జులై 1 - సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్

3వ టీ20: జులై 4 - కియా ఓవల్, లండన్

4వ టీ20: జులై 9 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్


Show Full Article
Print Article
Next Story
More Stories