Ind vs Eng: వన్డే క్యాప్ అందించిన తమ్ముడు - ఉద్వేగానికి లోనైన అన్న

India vs England Krunal Pandya Felt Emotional on Receiving an ODI Cap From Brother Hardik
x

హార్ధిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా (ఫొటో ట్విట్టర్)

Highlights

India vs England: తొలి వన్డేకు ముందు తన తమ్ముడు హార్దిక్ నుంచి వన్డే క్యాప్ అందుకున్న క్రునాల్ ఉద్వేగానికి లోనయ్యాడు.

India vs England: ఈ రోజు (మంగళవారం) ఇంగ్లాండ్ ‌తో జరుగుతున్న తొలి వన్డేకు ముందు తన తమ్ముడు హార్దిక్ పాండ్య నుంచి వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) క్యాప్ అందుకున్న ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కోసం బీసీసీఐ నుంచి పిలుపందుకొన్న క్రునాల్, కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసీద్ కృష్ణ.. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తమ తొలి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

2018 లో టీమిండియాలోకి అడుగుపెట్టిన 29 ఏళ్ల క్రునాల్, భారత్ తరఫున 18 టీ 20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. తన వన్డే క్యాప్‌ను అందుకున్న తరువాత, ఉద్వేగభరితమైన క్రునాల్.. ఆకాశం వైపు చూస్తూ.. తండ్రిని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు చిందించాడు. తన తమ్ముడు హార్దిక్ ను గట్టిగా కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చాడు.

అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రసిధ్.. విజయ్ హజారే ట్రోఫీ 2021 లో కర్ణాటక తరపున చేసిన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలోకి చేరే అవకాశం వచ్చింది. 25 ఏళ్ల ప్రసీద్‌కు వన్డే క్యాప్‌ను కె.ఎల్. రాహుల్ అందజేశాడు.

మొదటి వన్డేలో ఓ అరుదైన ఘనత చోటు చేసుకుంది. టీమిండియా తరపున హార్దిక్ మరియు క్రునాల్ సోదరులుగా బరిలోకి దిగుతుండగా... ఇంగ్లాండ్ టీం నుంచి సామ్ మరియు టామ్ కుర్రాన్ లు సోదరలుగా బరిలో నిలిచారు.

ఇక టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టాస్‌ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సాయంత్రం వాతావరణం తీవ్రంగా మారవచ్చనని, మొదట బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

ఇండియా vs ఇంగ్లాండ్: జట్లు

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాన్సన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాస్ బట్లర్ (కీపర్), బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Show Full Article
Print Article
Next Story
More Stories