India vs England: మూడో వన్డేలో భారత్ విజయం.. సిరీస్‌ 2-1తో కైవసం

India vs England, 3rd odi
x

ఇండియా విజయం


Highlights

India vs England: సిరీస్‌ 2-1తో కైవసం చేసుకుంది

India vs England: పుణే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 330 పరుగుల విజయలక్ష‌్యంతో బరిలోకి దిగిన బట్లర్ సేన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్‌ కరన్‌ (95 నాటౌట్‌; 83 బంతుల్లో 9×4, 3×6) భారత్‌ను భయపెట్టాడు.. డేవిడ్‌ మలన్‌(50,50 బంతుల్లో, 6 సిక్సులు) రాణించాడు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు. భూవనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా..నటరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్ బ్యాటింగ్ లోనూ.. బౌలింగ్ లో అద్బుతంగా రాణించాడు. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీ్మిండియా.. వన్డే ట్రోఫీనీ ఖాతాలో వేసుకుంది.

భారత్ జట్టు వరుసగా మూడోసారి 300పైచిలుకు స్కోరు చేసింది. 48.2ఓవర్లలో 329 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. దాంతో ఇంగ్లాండ్‌ ముందు 330 పరుగుల లక్ష్యం ఉంచింది. రిషభ్‌ పంత్‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్‌ పాండ్య (64; 44 బంతుల్లో 5×4, 4×6) చెలరేగి ఆడారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4), రోహిత్‌ శర్మ (37; 37 బంతుల్లో 6×4) తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. కోహ్లీ (7) త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ మిడిలాడ్డర్ బ్యాట్స్ మెన్ చెలరేగారు. దీంతో భారత్ మూడు వందలపై స్కోరు చేసింది. ఇక ఆఖర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (30) సిక్సర్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories