Ind Vs Eng 2nd Test: వరుణుడు వరం ఇస్తాడా.!? ఓటమి నుండి తప్పిస్తాడా..??

Ind Vs Eng 2nd Test: వరుణుడు వరం ఇస్తాడా.!? ఓటమి నుండి తప్పిస్తాడా..??
x
Highlights

India Vs England 2nd Test: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు...

India Vs England 2nd Test: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. నాలుగో రోజు బ్యాటింగ్ కి దిగిన భారత జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో గ్రీజులోకి వచ్చిన పూజార, రహనే ఇంగ్లాండ్ బౌలర్ల దూకుడుకు తమ బ్యాటింగ్ తో చివరి వరకు అడ్డుకట్ట వేశారు. చటేశ్వర పూజార 206 బంతులను ఎదుర్కొని 45 పరుగులను చేయడంతో పాటు అజింక్య రహనే 146 బంతులలో 61 పరుగులను చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు కాసేపు చెమటలు పట్టించారు.

అప్పటికే రెండు వికెట్లు తీసి మంచి ఊపు మీదున్న మార్క్ వుడ్ అద్బుత బంతితో పూజారని అవుట్ చేయడం, కాసేపటికే మొయిన్ అలీ బౌలింగ్ లో అజింక్య రహనే కీపర్ క్యాచ్ తో వెనుతిరగడంతో భారత అభిమానుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. జడేజా 4 పరుగులకే బౌల్డ్ అవగా.., నాలుగో రోజు ముగిసే సమయానికి రిషబ్ పంత్ 14, ఇషాంత్ శర్మ 4 పరుగులతో గ్రీజులో ఉన్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై 154 పరుగుల ఆధిక్యంలో ఉంది.

భారత్ ఈ మ్యాచ్ లో ఓటమి పాలుకాకుండా ఉండాలంటే ఐదో రోజు మొదటి రెండు సెషన్స్ కీలకంగా మారనుంది. లేదా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి అనుకూలించినట్టుగా భారత్ కి కూడా ఐదో రోజు వరుణుడు కరుణిస్తే తప్ప రెండో టెస్ట్ మ్యాచ్ ఓటమి నుండి టీమిండియా తప్పించుకోలేకపోవచ్చు. ప్రస్తుతం వాతావరణ సూచనల ప్రకారం లండన్ లో ఆకాశం మబ్బులతో కమ్మి ఉన్నా మ్యాచ్ సమయానికి వాతావరణం ఎవరికి అనుకూలిస్థిందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories