IND vs ENG 2nd ODI Today: జోరుమీదున్న భారత్; గెలుపే లక్ష్యంగా ఇంగ్లాండ్

India vs England 2nd ODI Today 26 03 2021 at Pune
x

టీమిండియా (ఫొటో బీసీసీఐ ట్విట్టర్)

Highlights

India vs England 2nd ODI: మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలిచి జోరు మీదుంది టీమిండియా.

India vs England 2nd ODI: మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలిచి జోరు మీదుంది టీమిండియా. మరోవైపు సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఇంగ్లాండ్ ఉంది. ఇప్పటికే రెండు ఫార్మెట్లలో సిరీస్ లో కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. ఇక వన్డే సిరీస్ లో నైనా గెలిచి విజయంతో సిరీస్ ముగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే నేడు పూణె వేదికగా మధ్యాహ్నం గం.1:30 నిమిషాలకు ప్రారంభంకానుంది. కోహ్లీ గ్యాంగ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. ఇంగ్లాండ్ టీం ఒత్తిడిలో కూరుకపోయింది. ఓటములతో నిరాశలో ఉన్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. కెప్టెన్‌ మోర్గాన్‌ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. మరి రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఎలాంటి వ్యూహాలతో సిద్ధం కానుందో చూడాలి.

కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు..

టీమిండియా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్స్ నుంచి టెయిలెండర్ల వరకు ఆల్‌రౌండ్‌ సత్తాతో దూసుకపోతోంది. అలాగే ఓపెనర్ ధావన్‌ ఫామ్ లోకి రావడం జట్టుకు బాగా కలిసొచ్చింది. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా తనదైన శైలిలో ఆడితే ఇంగ్లాండ్ బౌలర్లకు కష్టాలు తప్పవు. మొదటి వన్డేలో మోచేతి గాయంతో బాధపడ్డ రోహిత్.. పూర్తి ఫిట్‌నెస్‌తో రెండో వన్డేలో ఆడనున్నాడు. టాప్ ఆర్డర్ లో కోహ్లి, మిడిలార్డర్‌లో రాహుల్, హార్దిక్, కృనాల్‌ తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా తయారైంది. కాగా, గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే రిషభ్‌ పంత్‌ కు అవకాశం రావొచ్చు. బౌలింగ్‌లో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ వేటు పడే ఛాన్స్ ఉంది. ఇంతవరకు ఒక్కవికెట్ తీసుకోలేదు. పైగా ధారాలంగా పరుగులు ఇచ్చాడు. అతన్ని తప్పించి చహల్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

గెలిపించే వారేరి..

టీ20 సిరీస్‌లో మొదట హోరాహోరీగా తలపడిన ఇంగ్లాండ్‌ తర్వాత టీమిండియా ముందు నిలవలేకపోతోంది. తొలి వన్డేలోనూ లక్ష్య ఛేదనలో భారత్‌కు దీటుగా సాగిన ఇంగ్లాండ్‌ టీం.. బ్యాట్స్ మెన్స్ తడబడడంతో చేతులెత్తేసింది. గెలిపించే వారెవరో తెలియక నిరాశలో కూరుకపోయింది. టాప్ ఆర్డర్ లో బలంగా ఉన్నా... ఆ జోరు ను అందుకోవడంలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతుండడం కలవరపెడుతోంది. కెప్టెన్ మోర్గాన్‌ గాయంతో దూరమవడంతో ఈ మ్యాచ్ లో ఎలా ఆడతారనేది చూడాలి. ఓపెనర్లు రాయ్, బెయిర్‌ స్టోలతో పాటు.. స్టోక్స్, బట్లర్‌ నిలబడితేనే ఈ వన్డే ఫలితం మారొచ్చు. వీరిపైనే ఈ మ్యాచ్ ఆధారపడిందనడంలో సందేహం లేదు. నిలబడి వన్డే సిరీస్ లో ఉంటారో... లేక ఓడి కప్ ను భారత్ కు అందిస్తారో చూడాలి.

పిచ్, వాతావరణం

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. టాస్‌ గెలిస్తే.. బౌలింగ్ కు మొగ్గు చూపే అవకాశమే ఉంది. వర్షం ముప్పు లేదు.

జట్లు (అంచనా):

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, పంత్‌/సూర్యకుమార్, రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిధ్‌.

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్, స్యామ్‌ కరన్, టామ్‌ కరన్, రషీద్, వుడ్‌/టోప్లీ.

Show Full Article
Print Article
Next Story
More Stories