IND vs AUS: టీమిండియా సెమీస్ చేరాలంటే '152' కొట్టేయాల్సిందే.. టార్గెట్ సెట్ చేసిన ఆసీస్

IND vs AUS: టీమిండియా సెమీస్ చేరాలంటే 152 కొట్టేయాల్సిందే.. టార్గెట్ సెట్ చేసిన ఆసీస్
x
Highlights

India vs Australia, Women’s T20 World Cup 2024: మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం షార్జా వేదికగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

India vs Australia, Women’s T20 World Cup 2024: మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆదివారం షార్జా వేదికగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున గ్రేస్ హారిస్ 40, తహ్లియా మెక్‌గ్రాత్ 32, ఎల్లీస్ పెర్రీ 32 పరుగులు చేశారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

భారత్ తరపున ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ 2-2 వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. ఓ బ్యాటర్ రనౌట్ అయింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్‌ ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించాలి.

రెండు జట్ల ప్లేయింగ్-11

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ మరియు రేణుకా సింగ్.

స్ట్రేలియా: తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), బెత్ మూనీ, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.

Show Full Article
Print Article
Next Story
More Stories