టీ-20 ఫార్మాట్ 50 వికెట్ల క్లబ్ లో జస్ ప్రీత్ బుమ్రా

టీ-20 ఫార్మాట్ 50 వికెట్ల క్లబ్ లో జస్ ప్రీత్ బుమ్రా
x
Highlights

టీమిండియా యువఫాస్ట్ బౌలర్ , యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా టీ-20 క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు....

టీమిండియా యువఫాస్ట్ బౌలర్ , యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా టీ-20 క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆట 19వ ఓవర్లో బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా కంగారూ విజయాన్ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకురాగలిగాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, మిడిలార్డర్ ఆటగాళ్లు కౌల్టర్ నైల్ ల వికెట్లను బుమ్రా పడగొట్టాడు. టీ-20 క్రికెట్ చరిత్రలో 50 వికెట్ల ఘనత సాధించిన భారత తొలిబౌలర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా భారత తొలిఫాస్ట్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డుల్లో చేరాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories