India VS Australia: రేపే ఆఖరిపోరాటం.. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డు ఇదే

India VS Australia: రేపే ఆఖరిపోరాటం.. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డు ఇదే
x
Highlights

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరింది. సిడ్నీ టెస్టులో ఓటమిని తప్పించుకున్న టీమిండియా ఇప్పుడు ఆఖరి సమరానికి సన్నద్ధమైంది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైన తర్వాత కూడా తమ ఆత్మవిశ్వాసానికిలోటు లేదని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలిగితే ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించగలుగుతుంది. చివరి టెస్టు డ్రాగా నిలిచిన సిరీస్ సమం అవుతుంది.

మరో వైపు సొంతగడ్డపై టీమిండియా చేతిలో సిరీస్‌ను చేజార్చుకోరాదని అసీస్ భావిస్తోంది. ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. వన్డే సిరీస్‌లో పరాజయం, టి20ల్లో సిరీస్‌ విజయం తర్వాత టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–1తో సమంగా నిలిచిన భారత జట్టు ఆఖరి పోరులో తమ సత్తాను చాటుకునేందుకు బరిలోకి దిగనుంది. బ్రిస్బేన్ లోని గాబా గ్రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది. కీలక ఆటగాళ్లు గాయలపాలైనా..మూడో టెస్టులో చక్కటి పోరాటపటిమను టీమిండియా చూపింది. మిగిలిన నాలుగో ఆదే స్పూర్తి కొనసాగించాలని చూస్తోంది. బ్రిస్బేన్‌లో 6 టెస్టులు ఆడిన భారత్‌ ఒక్కటి కూడా గెలవలేదు. 5 ఓడి 1 మ్యాచ్‌ డ్రా చేసుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 62 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్‌ 8 మాత్రమే ఓడింది.

గాయాలతో జడేజా, హనుమ విహారి చివరి టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది. అయితే ప్రధాన పేసర్‌ బుమ్రా విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. బుధవారం టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో బుమ్రా మాత్రం బౌలింగ్‌ చేయలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అశ్విన్‌ పూర్తిగా కోలుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. విహారి స్థానంలో మయాంక్‌ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. జడేజా స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ రావచ్చు. నాలుగో పేసర్‌ను తీసుకోవాలంటే శార్దుల్‌ ఠాకూర్‌కు అవకాశం రానుంది. బుమ్రా తప్పుకుంటే నటరాజన్‌ అరంగేట్రం చేస్తాడు. బ్యాటింగ్‌లో రహానే, పుజారాలపై ప్రధాన భారం ఉంది. వీరిద్దరు నిలబడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఓపెనర్లు రోహిత్, గిల్‌ కూడా రాణిస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు.

సిడ్నీలో గెలుపు అవకాశాన్ని చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఒత్తిడిలో కూరుకుపోయింది. బ్రిస్బేన్‌లో ఆడేందుకు భారత్‌ భయపడుతుందంటూ వ్యాఖ్యలు చేసినవారంతా సిడ్నీలో టీమిండియా ప్రదర్శన తర్వాత నోరు విప్పే సాహసం చేయలేదు. ఆస్ట్రేలియాకు అనుకూలంగా బ్రిస్బేన్‌లో పరిస్థితి ఉందని తాను చెప్పలేనని స్పిన్నర్‌ లయన్‌ వ్యాఖ్యానించడం పరిస్థితిని చూపిస్తోంది. స్మిత్‌ ఫామ్‌లోకి ఫోమ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసోచ్చే అంశం. లబ్‌షేన్‌ రాణిస్తే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. నాథన్‌ లయన్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్‌ లో రికార్డులు సృష్టించాలని భావిస్తున్నాడు. 'గాబా' మైదానంలో 1988నుంచి ఓటమి ఎరుగని రికార్డును ఆస్ట్రేలియా కొనసాగిస్తుందా? రహానే సేన ధాటికి తలవంచుతుందా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories