Ind vs Aus 3rd Test: మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా... WTC కి ఇంకా ఛాన్స్ ఉందా?

Ind vs Aus 3rd Test: మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా... WTC కి ఇంకా ఛాన్స్ ఉందా?
x
Highlights

Ind vs Aus 3rd Test Match Highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. ఐదో రోజు...

Ind vs Aus 3rd Test Match Highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. ఐదో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసేటప్పటికీ ఆసిస్ 89 పరుగులు చేసింది. వర్షం కారణంగా టీమిండియాకు 275 టార్గెట్ విధించారు. ఓపెనర్స్ యశస్వి జైశ్వాల్, కే.ఎల్. రాహుల్ చెరో ఫోర్ కొట్టారు. ఆ తరువాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు 1:1 పాయింట్స్‌తో సమానమయ్యాయి.

ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో (Ind vs Aus 4th test ) జరగనుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఎందుకంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఓడిన జట్టుకు విజయావకాశాలు తగ్గడంతో పాటు వారిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకాదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌ ర్యాంకింగ్స్‌లో (WTC points ) పై చేయి సాధించాలన్నా ఇండియాకు ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కానుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సౌతాఫ్రికా 63.33% పాయింట్స్ పర్సంటేజ్‌తో ముందంజలో ఉంది. ఆ తరువాత స్థానంలో 58.88% పాయింట్స్ పర్సంటేజ్‌తో ఆస్ట్రేలియా ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అవడంతో ఇండియా పాయింట్స్ పర్సెంటేజ్ 55.88 శాతానికి పడిపోయింది. ఆసిస్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల ( India vs Australia test ) ఫలితంపై ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌ పాయింట్స్ పర్సెంటేజ్ స్కోర్ పెరగడం లేదా తగ్గడం అనేది ఆధారపడి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories