Ind vs Aus : కోహ్లి ఒంటరి పోరాటం!

Ind vs Aus :  కోహ్లి ఒంటరి పోరాటం!
x
Highlights

అయితే ఆ తర్వాత లైయన్‌ వేసిన బంతికి పుజారా వికెట్ల దగ్గర దొరికిపోవడంతో భారత్ టీ విరామానికి ముందు మూడో వికెట్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రహానె, కోహ్లికి తోడవ్వడంతో ఇద్దరు కలిసి ఆసీస్ బౌలర్లకి పరీక్ష పెట్టారు.

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్‌ పృథ్వీషా (0) వికెట్ ని చేయిజార్చుకుంది. ఇక మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (17; 40 బంతుల్లో ) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లి, పుజారా మూడో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. అలా ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే ఆ తర్వాత లైయన్‌ వేసిన బంతికి పుజారా వికెట్ల దగ్గర దొరికిపోవడంతో భారత్ టీ విరామానికి ముందు మూడో వికెట్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రహానె, కోహ్లికి తోడవ్వడంతో ఇద్దరు కలిసి ఆసీస్ బౌలర్లకి పరీక్ష పెట్టారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదేశారు. ఈ క్రమంలో కోహ్లి తన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు గాను 168 బంతుల్లో 88 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించి జట్టు స్కోరును 150 దాటించారు. అయితే జట్టు స్కోరు 188 వద్ద రహనే అనవరమైన పరుగుకి ప్రయత్నం చేయడంతో కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. దీనితో సెంచరీ చేయకుండానే కోహ్లి వెనుదిరిగాడు.

ఆ తరవాత కొద్దిసేపటికే రహనే కూడా అవుట్ అయ్యాడు. వరుసగా ఇద్దరు వెంటవెంటనే అవుట్ అవ్వడంతో భారత్ కి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఇక హనుమ విహారి (16; 25 బంతుల్లో) కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నైట్‌ వాచ్‌మన్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ‌(15; 17 బంతుల్లో) వృద్ధిమాన్‌ సాహా (9; 25 బంతుల్లో ) మరో వికెట్‌ ఆడుతూ వచ్చారు. దీనితో ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లను కోల్పోయి 233 పరుగులు చేసింది. మొదటిరోజు ఆటలో ఆసీస్ బౌలర్ల ఆధిపత్యమే కొనసాగిందని చెప్పాలి. అద్భుతంగా బంతులేసిన ఆసీస్‌ పేసర్లు భారత బాట్స్ మెన్స్ ని ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories