భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే..

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో వన్డే..
x
Highlights

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(మంగళవారం ) రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. విదర్భ క్రికెట్‌ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం...

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(మంగళవారం ) రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. విదర్భ క్రికెట్‌ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రెండో విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. గతంలో తమకు అచ్చొచ్చిన వీసీఏ మైదానంలో మరో విజయం సాధించాలనుకుంటోంది.

బౌలర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటకీ… టాపార్డర్‌ పుంజుకుంటే మరో విజయం పెద్ద కష్టం కాదు. మరోవైపు సిరీస్ సమం చేయాలని ఆసీస్ కూడా పట్టుదలగా ఉన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయమని చెప్పొచ్చు. రెండో వన్డేలో మార్పుల్లేని జట్టుతో కోహ్లి సేన బరిలోకి దిగేలా ఉంది. కచ్చితంగా రాహుల్‌కు అవకాశమివ్వాల ని భావిస్తే తప్ప ధావన్, రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories