IND vs AFG: సిరాజ్ పై వేటు.. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో కీలక ప్లేయర్ ఎంట్రీ.. ఆఫ్ఘాన్‌కి మడత పడాల్సిందే..!

India vs Afghanistan Super 8 Match Kuldeep Yadav may Replace Mohammed Siraj in Playing xi super 8 Match
x

IND vs AFG: సిరాజ్ పై వేటు.. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో కీలక ప్లేయర్ ఎంట్రీ.. ఆఫ్ఘాన్‌కి మడత పడాల్సిందే..!

Highlights

India vs Afghanistan Bowling Combination: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ రౌండ్‌ను విజయంతో ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది.

India vs Afghanistan Bowling Combination: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ రౌండ్‌ను విజయంతో ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది. సెమీఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. ఈ కారణంగా, భారత జట్టు బౌలింగ్ కలయికలో కీలక మార్పులు కనిపించవచ్చని తెలుస్తోంది. మహ్మద్ సిరాజ్‌ను తప్పించడం ద్వారా కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ వస్తుందని అంటున్నారు.

కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు..

కుల్దీప్ యాదవ్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అతనికి న్యూయార్క్‌లో ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. కరేబియన్ గడ్డపై స్పిన్నర్లకు చాలా సహాయం అందుతుంది. అందుకే భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతుంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు బెంచ్‌లో కూర్చున్న కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. కుల్దీప్‌ తన చైనామన్ కళతో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాగలడు.

మహ్మద్ సిరాజ్‌కు మొండిచేయి..

ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఆడితే మహ్మద్ సిరాజ్‌ బెంచ్‌కే పరిమిత కావొచ్చు. సిరాజ్ పెర్ఫార్మెన్స్ ఇంతవరకూ ప్రత్యేకంగా ఏంలేదు. అతను 3 మ్యాచ్‌ల్లో ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. అందుకే, అతనిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించి, కుల్దీప్ యాదవ్‌తో భర్తీ చేయవచ్చు. అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అందుకే వారిని డ్రాప్ చేయకపోవచ్చు. ఈ క్రమంలో సిరాజ్‌ను తప్పించే అవకాశం ఉంది.

సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో టీమిండియా పోటీపడనుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే, భారత జట్టు కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. అలాగే, రోహిత్ సేన నెట్ రన్ రేట్‌ను మెరుగ్గా ఉంచుకోవాలి. గ్రూప్‌లోని టాప్ 2 జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు వెళ్తాయి. ఆఫ్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియాల నుంచి టీమిండియాకు గట్టి పోటీ ఎదురుకావచ్చు. ఇది కాకుండా, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ప్రదర్శించిన ఆటను తేలికగా తీసుకోవడం చాలా పెద్ద తప్పుగా మారొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories