ఆస్ట్రేలియా ఇండియా టూర్ షెడ్యూల్ ఖరారు

ఆస్ట్రేలియా ఇండియా టూర్ షెడ్యూల్ ఖరారు
x
Highlights

ఆస్ట్రేలియాలో ఇండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఐతే కంగారూ జట్టుతో తొలిసారి పింక్ బాల్ ఫైట్‌కు సిద్ధం అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి...

ఆస్ట్రేలియాలో ఇండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఐతే కంగారూ జట్టుతో తొలిసారి పింక్ బాల్ ఫైట్‌కు సిద్ధం అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇక అటు బాక్సింగ్ డే టెస్టుకు, న్యూ ఇయర్ మ్యాచ్‌కు వారం రోజుల టైం ఇస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఓకె చెప్పింది.

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. 3టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టుల తేదీలను ఐసీసీ ప్రకటించింది. డిసెంబర్‌ 17న స్టార్ట్ అయ్యే డే అండ్ నైట్ టెస్టుకు ముందు సిడ్నీలో అదనంగా మరో డే అండ్ నైట్‌ వార్మప్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓకే చెప్పింది. నవంబర్ 10న యూఏఈ నుంచి టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు. నవంబర్‌ 12 నుంచి అక్కడి నిబంధనల ప్రకారం 12రోజులు క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తారు.

కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ డిసెంబర్‌ 17న స్టార్ట్ అవుతుంది. బీసీసీఐ డిమాండ్‌ మేరకే బాక్సింగ్‌ డే టెస్ట్, న్యూ ఇయర్ టెస్ట్ మ్యాచ్‌కు మధ్య వారంరోజుల టైం ఇస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక టెస్టు సిరీస్‌ తొలి మ్యాచే పింక్ బాల్‌తో జరుగుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా నాలుగు డే అండ్ నైట్ టెస్టులు ఆడగా అన్నీ గెలిచింది. ఐతే ఇండియా మాత్రం ఒక్కటే ఆడింది. బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక డే అండ్ నైట్‌ టెస్టులో విజయం సాధించింది.

నవంబర్‌ 27 ఫస్ట్ వన్డే 29న రెండో వన్డే, డిసెంబర్‌ 2న మూడు వన్డే జరగనుంది. ఇక డిసెంబర్‌ 4, 6, 8 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయ్. ఇక రెండు జట్ల మధ్య డిసెంబర్‌ 17-21 మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా 26 నుంచి 30వరకు రెండోది. జనవరి 7 నుంచి 11వరకు మూడో టెస్ట్. 15 నుంచి 19వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు ఫార్మాట్లకు సంబంధించి బీసీసీఐ జట్లను ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories