India to IOC: ఇండియాకు ఛాన్స్ ఇవ్వండి.. మేం రెడీ: ఐఓసీకి భారత్ లేఖ

India to IOC: ఇండియాకు ఛాన్స్ ఇవ్వండి.. మేం రెడీ: ఐఓసీకి భారత్ లేఖ
x
Highlights

India submits letter of intent to IOC to host 2036 Olympics: విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్...

India submits letter of intent to IOC to host 2036 Olympics: విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం (IOA) ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే.. 2028 లాస్ ఏంజెల్స్, 2032 బ్రిస్బేన్‌లో ఒలింపిక్స్ వేదికలు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి 2036పై ఉండగా.. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ రేసులో ఉందని భారత ఒలింపిక్స్ కమిటీ గతంలో వెల్లడించింది. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అయితే వచ్చే ఏడాది జరిగే ఐఓసీ ఎన్నికలు జరిగేంత వరకు హోస్ట్‌పై నిర్ణయం తీసుకోరు. మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం చాలా దేశాలతో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే వంటి అనేక దేశాలు ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ మొదట 2032 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపించింది. కానీ కొన్ని కారణాల వల్ల 2036లో నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే విస్తృతస్థాయిలో బిడ్డింగ్ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే అప్లికేషన్లను పరిశీలించి ఐఓసీ నాయకత్వ విభాగం.. ఈ హెూస్టింగ్ రైట్‌‌ను కట్టబెట్టే ఆస్కారం ఉంది. స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టింగ్ హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ, ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఐఓసీ (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) కూడా భారత్ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తితో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇండియా బిడ్ ఓకే అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వెనక్కి తగ్గేదే లేదంటున్న మోదీ

2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని గతంలో ప్రధాని మోడీ చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులు ఉత్సాహంగా ఉన్నారని.. 2036 ఒలింపిక్స్‌ను హోస్ట్ చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తామన్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గమని.. ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని అన్నారు.

పారిస్‌లో ఈ ఏడాదే విశ్వ క్రీడలు ముగియగా.. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో జరగబోతున్నాయి. అనంతరం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ వేదికగా 2032 విశ్వ క్రీడా సంబురం మొదలవ్వనుంది. ఇక 2036 ఒలింపిక్స్ నిర్వహణ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఇప్పటికే పదుల సంఖ్యలో దేశాలు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాయంటూ లేఖలు రాశాయని ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాస్చ్ వెల్లడించారు. దీంతో భారత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories