ICC Test Rankings: భార‌త్ నంబ‌ర్ 1..రెండో స్థానానికి న్యూజిలాండ్

ICC Mens Test Team Rankings
x

ఇండియా టెస్ట్ టీం ఫైల్ ఫోటో 

Highlights

ICC Test Rankings: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మ‌రో అరుదైన ఫీట్ అందుకుంది.

ICC Test Rankings: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మ‌రో అరుదైన ఫీట్ అందుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ర్యాకింగ్స్‌లో భార‌త జ‌ట్టు మొద‌టి స్థానంలో నిలిచింది. టీమిండియా 121 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, న్యూజిలాండ్ ఒకే ఒక్క పాయింట్‌తో వెన‌క‌బ‌డి 2వ‌ స్థానానికి ప‌రిమిత‌మైంది. ఆ జ‌ట్టు ఖాతాలో ప్ర‌స్తుతం 120 పాయింట్లు ఉన్నాయి. ఇక 109 పాయింట్ల‌తో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 108 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, 94 పాయింట్ల‌తో 5వ‌ స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి.

ఏడాది వ్య‌వ‌ధిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టు సీరీస్ ల‌లో భార‌త్ భారీ విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాను సొంత గ‌డ్డ‌పై ఓడించి భార‌త్ రికార్డు సృష్టించింది. ఆసీస్ తో జ‌రిగిన టెస్టు సిరీస్ లో భారత్ పై 2-1 తేడాతో విజ‌యం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది.

ఇంగ్లండ్‌లో 3-1 తేడాతో గెలుపొందింది. మ‌రోవైపు న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై 2-0 తేడాతో, పాకిస్థాన్‌తోనూ 2-0 తేడాతో విజ‌యాలు సాధించింది. ఈ నేప‌థ్యంలో సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో -భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories