భారత్‌ లక్ష్యం 265

భారత్‌ లక్ష్యం 265
x
Highlights

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తిరుగులేని పోరాట పటిమతో ఆకట్టుకుంది. కోహ్లీ సేనకు 265 పరుగుల...

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తిరుగులేని పోరాట పటిమతో ఆకట్టుకుంది. కోహ్లీ సేనకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏంజెలో మాథ్యూస్ అద్భుత సెంచరీకి తోడు లహిరు తిరుమన్నె అర్ధ శతకంతో రాణించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మాథ్యూస్, తిరుమన్నె ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వా 29 పరుగులు చేయగా కుశాల్ మెండీస్(3), తిసార పెరీరా(2) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా(3/37) గొప్పగా బౌలింగ్ చేసి లంకను కుప్పకూల్చాడు. కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, జడేజా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories