సెహ్వాగ్ సింగిల్ డిజిట్.. సచిన్ డకౌట్.. మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించిన పఠాన్

సెహ్వాగ్ సింగిల్ డిజిట్.. సచిన్ డకౌట్.. మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించిన పఠాన్
x
Irfan Pathan
Highlights

సెహ్వాగ్ సింగిల్ డిజిట్ కే ఔట్. సచిన్ డకౌట్.. యువరాజ్ 1పరుగుల.. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ జట్టును ఆదుకున్నాడు. స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన జట్టును విజయ తీరాలకు చెర్చాడు. గిల్ డిజిట్.. సచిన్ డకౌట్.. గెలిపించిన పఠాన్

సెహ్వాగ్ సింగిల్ డిజిట్ కే ఔట్. సచిన్ డకౌట్.. యువరాజ్ 1పరుగుల.. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ జట్టును ఆదుకున్నాడు. స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన జట్టును విజయ తీరాలకు చెర్చాడు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్‌ రోడ్డ్ సేఫ‌్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా భారత్ లెజెండ్స్ శ్రీలంక లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏనిమిది వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. శ్రీలంక లెజెండ్స్ బ్యాట్స్ మెన్స్ దిల్షాన్(23),చామార(23),రోమేష్ (21) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లో, జహీర్ ఖాన్, పఠాన్, గోనీ, తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

139 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన సచిన్ సారథ్యంలో టీమిండియా లెజెండ్స్ జట్టుకు ఆదిలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. టీమిండియా లెజెండ్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రనౌట్ కాగా.. సచిన్ సున్నా పరుగుకే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యూవీ సింగ్ డిజిట్ కే వెనుదిరగడంతో ఐదు ఓవర్లలోనే 19 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో మహ్మాద్ కైఫ్ (46), సంజయ్ బంగర్ కొద్దీ సేపు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వారు కూడా వరుసగా ఔట్ అవ్వడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖాయం అని అంతా అనుకున్నారు. దీంతో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్ పఠన్ మరోసారి ఆల్ రౌండ్ ప్రదర్శన చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ కేవలం 31 బంతుల్లోనే 57పరుగులు సాధించాడు. అందులో ఆరు ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. పఠాన్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దిల్షాన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మ్యాచ్ శనివారం ఇండియా లెజెండ్స్ , సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories