Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ శుభారంభం..

India Kicked Off The Asian Games On A Grand Note
x

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ శుభారంభం..

Highlights

Asian Games 2023: మహిళల క్రికెట్‌లోనూ భారత్‌కు పతకం ఖరారు

Asian Games 2023: ఆసియా క్రీడలను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలి రోజే పతకాల వేటను షురూ చేశారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇవాళ మహిళల షూటింగ్, పురుషుల రోయింగ్‌తో పాటు మహిళల క్రికెట్‌లో పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇండియాకు తొలి పతకం లభించింది. రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించింది.

చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్యా పతకం గెలుచుకున్నది. మరోవైపు రోయింగ్‌లో కూడా భారత్ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. రోయింగ్‌ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు. మరో వైపు మహిళల క్రికెట్‌లోనూ భారత్‌కు పతకం ఖారారైంది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ కేవలం 51 పరుగులకే కుప్పకూలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories