భారత్ విజయానికి వరుణుడు అడ్డంకి

భారత్ విజయానికి వరుణుడు అడ్డంకి
x
Highlights

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో భారత్ విజయం అసాధ్యంగా మారింది. నాలుగో రోజు వాతావరణం కారణంగా 30 లోపే ఆట...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో భారత్ విజయం అసాధ్యంగా మారింది. నాలుగో రోజు వాతావరణం కారణంగా 30 లోపే ఆట ముగిసింది. ఇక ఆఖరి రోజు వర్షం కురుస్తుండడంతో అంఫైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మొదటి ఇన్నింగ్స్ లో 300 పరుగులకు అల్ అవుట్ అయిన ఆసీస్ ఫాలో ఆన్ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్‌ లో ఆసీస్‌ 6 పరుగులు చేసింది. క్రీజులో ఖవాజా, హారిస్‌ ఉన్నారు.

ఇక అంతకు ముందు భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులతో డిక్లేర్డ్ చేసింది. ఇంకా ఆస్ట్రేలియా 316 పరుగులు వెనకబడి ఉంది. ఇదిలావుంటే నాలుగో రోజు ఆరో బంతికే కమిన్స్‌ (25)ను షమీ బౌల్డ్‌ చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌కు రాగానే తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి హ్యాండ్స్‌కోంబ్‌ (111 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేసినా నిలవలేదు. బుమ్రా వేసిన బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ వెంటనే లయన్‌ ను డక్ అవుట్ చేశాడు కుల్దీప్‌ అయితే ఆసీస్‌ చివరి జోడీ స్టార్క్‌ (55 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు), హాజల్‌వుడ్‌ (45 బంతుల్లో 21; 2 ఫోర్లు) టీమిండియా బౌలర్లకు విసుగు తెప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories