టీమిండియా ఓటమి.. అభిమాని మృతి!

టీమిండియా ఓటమి.. అభిమాని మృతి!
x
Highlights

నిన్న జరిగిన సెమీ ఫైనల్ లో టీమిండియా ఓటమి ఓ అభిమాని మరణానికి కారణమైంది. ఈ సంఘటన విజయనగరం జిల్లలో చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం రెల్లివలస...

నిన్న జరిగిన సెమీ ఫైనల్ లో టీమిండియా ఓటమి ఓ అభిమాని మరణానికి కారణమైంది. ఈ సంఘటన విజయనగరం జిల్లలో చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) విజయనగరంలోని ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం వరకూ డ్యూటీలో తోటి సహచారులతో గడిపిన రాము సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను చూస్తూ టెన్షన్‌కి గురయ్యాడు. భారత్‌ ఓటమి అంచుకు చేరగానే తీవ్రమైన ఒత్తిడికి లోనై కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, సహచరులు, తోటి ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories