ICC World Cup 2023: శ్రీలంకను చిత్తుచేసిన భారత బౌలర్లు.. వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా

India Beats Sri Lanka by 302 Runs
x

ICC World Cup 2023: వరల్డ్ కప్‌లో చెలరేగిన టీమిండియా

Highlights

ICC World Cup 2023: శ్రీలంకపై 302 పరుగుల భారీ విజయం

ICC World Cup 2023: వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. పాయింట్స్‌ పట్టికలో టాప్‌లో నిలిచింది రోహిత్‌ సేన. ఇవాళ శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. ఆది నుంచి ధీటుగా బౌలింగ్‌ వేస్తూ.. లంక బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించారు. తొలి ఓవర్‌ నుంచే లంకేయులను విలవిల లాడించారు. మహ్మద్‌ షమీ, సిరాజ్‌, బుమ్రా బౌలింగ్‌ను లంక బ్యాటర్లు ఎదుర్కోలేక.. వికెట్లు సమర్పించుకున్నారు. ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు షమీ. 5 వికెట్లు పడగొట్టి.. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో 45 వికెట్లు తీస జహీర్‌ఖాన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు షమీ.

ముంబై వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన వన్డేలో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి.. 357 పరుగులు చేసింది. అయితే.. గిల్, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్.. ముగ్గురు బ్యాట్స్‌మెన్లు.. కొద్దిలో సెంచరీలు మిస్‌ చేసుకున్నరు. వీరి పరుగుల వరదతో లంక ముందు 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది రోహిత్‌ సేన. అయితే.. భారీ ఛేదన చేసే క్రమంలో లంకేయులు ఆది నుంచే తడబడ్డారు. వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. 19.4 ఓవర్లలో శ్రీలంక.. 55 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్‌ సేన సంచలన విజయం నమోదు చేసింది. 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories