చరిత్ర మరిచిపోలేని రోజు.. ఆ అద్భుత ఘట్టానికి 13 ఏళ్ళు!

చరిత్ర మరిచిపోలేని రోజు.. ఆ అద్భుత ఘట్టానికి 13 ఏళ్ళు!
x

2007 world T20 cup 

Highlights

2007 T20 World Cup : సెప్టెంబర్ 24... ఈ రోజును ఎవరు కూడా మరిచిపోలేరు.. ఎందుకంటే ఇదే రోజున భారత క్రికెట్ జట్టు మొదటిసారిగా

2007 T20 World Cup : సెప్టెంబర్ 24... ఈ రోజును ఎవరు కూడా మరిచిపోలేరు.. ఎందుకంటే ఇదే రోజున భారత క్రికెట్ జట్టు మొదటిసారిగా టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది.. సౌత్ ఆఫ్రికా గడ్డపైన జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో ముందుకు వెళ్తూ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడించి విజేతగా నిలిచింది.. ఈ అద్భుతమైన ఘట్టానికి నేటికి 13 ఏళ్ళు నిండాయి.. వాస్తవానికి ఈ టూర్ కి వెళ్లేముందు భారత జట్టు పైన ఎలాంటి అంచనాలు లేవు..

ఎందుకంటే అప్పుడే 2007 ప్రపంచ కప్ లో చాలా చెత్త ప్రదర్శనను కనబరిచి ఇంటి ముఖం పట్టింది భారత్.. ఆ సమయంలో ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ధోనికి పగ్గాలు అప్పజెప్పింది బీసీసీఐ.. అంత యువ జట్టుతో కలిసి టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ అంచనాలని తలకిందులు చేస్తూ ఒక్కో విజయాన్ని అందుకుంటూ వచ్చింది.. సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత్..

ఇక ఫైనల్ లో భారత్‌ పాక్‌ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణిత 20 ఓవర్లలో 157/5 స్కోరును నమోదు చేసింది. ఇందులో గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు, రోహిత్ శర్మ నుండి 16 బంతుల్లో 30 పరుగులు చేశారు. ఆ తరవాత లక్ష్య చేధనకి దిగిన పాక్ మొదట్లో తడబడ్డ ఆ తర్వాత దూకుడును ప్రదర్శించింది. కేవలం 5.3 ఓవర్లలోనే 53పరుగులు సాధించి పాక్‌ మెరుగైన రన్‌రేటును సాధించింది. ఆ తర్వాత మిస్బావుల్‌ హక్‌ చివరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే జట్టుకు 06 పరుగులు అవసరం అనుకున్న క్రమంలో జోగేందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో మిస్బావుల్‌ స్కూప్ షాట్ ఆడగా, శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ఇండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ చెరో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ధోని ఫస్ట్ కెప్టెన్సీలోనే ఇండియా జట్టు ఇంతటి విజయాన్ని అందుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతమైన ఘట్టానికి నేటికి 13 ఏళ్ళు నిడడంతో ఆనాటి జ్ఞాపకాలను అభిమనులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఐసిసి ప్రపంచ కప్ 2011తో పాటుగా 2013 లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలను అందించాడు ధోని..

Show Full Article
Print Article
Next Story
More Stories