Asia Cup 2023: నేపాల్‌ చిత్తు.. సూపర్‌-4కు టీమిండియా

India beat Nepal by 10 Wickets Qualify for Super 4 stage
x

Asia Cup 2023: నేపాల్‌ చిత్తు.. సూపర్‌-4కు టీమిండియా

Highlights

Asia Cup 2023: బౌండరీలు, సిక్సర్లతో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్

Asia Cup 2023: సియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ , నేపాల్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48 ఓవర్ల రెండు బంతులకు 230 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా 23 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. దీంతో డక్ వర్త్ లూయిస్ విధానంతో 145 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించారు.

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అలవోకగా విజయలక్ష్యాన్ని చేధించారు. రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు, శుభ్ మన్ గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు అందించి అజేయంగా నిలిచారు. పది వికెట్ల తేడాతో నేపాల్‌పై విజయం సాధించి, ఆసియా కప్‌ పోటీల్లో సూపర్ 4కు టీమిండియా అర్హత సాధించింది. టీమిండియా విజయంలో అత్యధిక స్కోరుతో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మను ప్లేయర్‌ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories