IND vs ZIM: అభిషేక్, రుతురాజ్, రింకూల తుఫాన్ ఇన్నింగ్స్.. జింబాబ్వేపై రికార్డ్ స్కోర్..
IND vs ZIM, 2nd T20I: టీ-20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో జింబాబ్వేకు 235 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది.
IND vs ZIM, 2nd T20I: టీ-20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో జింబాబ్వేకు 235 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. టీ-20లో భారత్ 34వ సారి 200కు పైగా పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కేవలం 23 సార్లు మాత్రమే 200కు పైగా పరుగులు నమోదు చేసింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. జింబాబ్వేపై భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరుగా మారింది. గతంలో 186 పరుగుల రికార్డ్ నమోదు చేసింది.
భారత్ తరపున రెండో మ్యాచ్ ఆడుతోన్న అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు సాధించాడు. జింబాబ్వేపై భారత ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమానార్హం. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 132 పరుగుల రికార్డు భాగస్వామ్యం ఉంది. జింబాబ్వేపై భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రింకూ సింగ్ 22 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజారబానీ, వెల్లింగ్టన్ మసకద్జాలకు తలో వికెట్ దక్కింది.
Innings Break!
— BCCI (@BCCI) July 7, 2024
A solid batting display from #TeamIndia! 💪 💪
A maiden TON for @IamAbhiSharma4
An unbeaten 77 for @Ruutu1331
A cracking 48* from @rinkusingh235
Over to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/yO8XjNqmgW#ZIMvIND pic.twitter.com/FW227Pv4O3
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), కైయా ఇన్నోసెంట్, డియోన్ మైయర్స్, వెస్లీ మాధేవర్, బ్రియాన్ బెన్నెట్, క్యాంప్‌బెల్ జొనాథన్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్మవుతా, ముజరబానీ బ్లెస్సింగ్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire