Video: 3.5 ఏళ్ల తర్వాత తొలి వికెట్.. సెంచరీ ప్లేయర్‌కి దిమ్మతిరిగే షాక్.. సుందర్ డ్రీమ్ డెలివరీ వీడియో చూశారా

Video: 3.5 ఏళ్ల తర్వాత తొలి వికెట్.. సెంచరీ ప్లేయర్‌కి దిమ్మతిరిగే షాక్.. సుందర్ డ్రీమ్ డెలివరీ వీడియో చూశారా
x
Highlights

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న పుణె టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో తమిళనాడు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ టీమిండియాలో చోటు...

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న పుణె టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో తమిళనాడు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో జట్టులోకి వచ్చిన ఈ ఆటగాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో అద్భుతాలు చేశాడు. ఈ 25 ఏళ్ల స్పిన్నర్ చివరిసారిగా మార్చి 2021లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్రకు ఓ అద్భుతమైన బంతిని వేశాడు. ఈ యువ బ్యాట్స్‌మన్ బంతిని ఆడలేకపోవడంతోపాటు అదే షాక్‌తో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో నెటిజన్లు సుందర్ డ్రీమ్ డెలివరీ ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

7 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్..

ఒకానొక దశలో రచిన్ రవీంద్ర పూర్తిగా క్రీజులో స్థిరపడ్డాడు అనుకుంటున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన డెలివరీతో 65 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్‌ను ముగించాడు. రవీంద్ర ఈ ఇన్నింగ్స్‌లో 105 బంతులు ఆడి 5 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. కానీ సుందర్ వేసిన బంతికి దిమ్మ తిరిగే షాక్ తగిలి, పెవిలియన్ చేరాడు. 60వ ఓవర్ లో సుందర్ వేసిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

3.5 ఏళ్ల తర్వాత సుందర్‌కి తొలి వికెట్‌ లభించింది. అతను వేసిన బంతి చాలా అద్భుతంగా ఉందంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. దీనిని ఎంత వర్ణించినా, తక్కువే. ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఈ బంతిని ఆడటం కష్టమే. అందుకే సుందర్ బౌలింగ్ బాగా వైరల్ అవుతోంది. రచిన్‌ని ఔట్ చేసిన తర్వాత, సుందర్ టామ్ బ్లండెల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్‌లను ఇలా మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.

తొలి టెస్టు తర్వాత సుందర్‌ను టీమ్‌ ఇండియాలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ప్లేయింగ్ 11లో అతనికి అవకాశం వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, అతను ప్లేయింగ్ 11 లోకి వచ్చిన వెంటనే అద్భుతాలు చేశాడు. మొత్తం 7 వికెట్లను తీసి తన పేరిట చరిత్ర సృష్టించుకున్నాడు. సుందర్ 23.1 ఓవర్లలో 59 పరుగులిచ్చి మొత్తం 7 వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే, మొత్తం జట్టు 259 పరుగులకే కుప్పకూలింది. కివీస్ తరపున డ్వేన్ కాన్వే అత్యధిక ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా తొలిరోజు న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories