IND vs NZ 2nd Test: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూణే టెస్ట్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్.. ప్లేయింగ్ 11 చూస్తే కివీస్‌కు గుండె దడే

IND vs NZ 2nd Test: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూణే టెస్ట్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్.. ప్లేయింగ్ 11 చూస్తే కివీస్‌కు గుండె దడే
x
Highlights

India vs New Zealand 2nd Test Playing XI: భారత్ - న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పూణెలో జరగనుంది. బెంగళూరులో...

India vs New Zealand 2nd Test Playing XI: భారత్ - న్యూజిలాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పూణెలో జరగనుంది. బెంగళూరులో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో పుంజుకోవడానికి రోహిత్ శర్మ సేన సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త వచ్చింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు.

బెంగళూరులో పంత్ కాలికి గాయం..

పంత్‌కు ఇంతకు ముందు ఆపరేషన్‌ చేసిన మోకాలికి బెంగళూరు టెస్టు ఆడుతుండగా గాయమైంది. ఈ కారణంగా మ్యాచ్‌లో ఎక్కువ సమయం వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా బ్యాటింగ్ చేసి 99 పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ నొప్పి కారణంగా చాలా అసౌకర్యంగా కనిపించాడు. అయినప్పటికీ అతను నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. కొన్నిసార్లు అతను వికెట్ల మధ్య పరుగులుతీసే క్రమంలో తడబడుతూ కనిపించాడు. పంత్ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇది టీమిండియాకు శుభవార్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పంత్ ఫిట్‌నెస్ గురించి రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

రిషబ్ పంత్ మోకాలి గాయం విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. రోహిత్ మాట్లాడుతూ.. "పంత్ కాలికి కీలక ఆపరేషన్ జరిగింది. వాటితోపాటు చిన్న శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. గత ఏడాదిన్నర కాలంలో అతను చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంత ఈజీగా పరుగులు తీయలేదు. అందుకే అతను బంతిని స్టాండ్స్‌లోకి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం..

బెంగళూరు టెస్టు తర్వాత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుందర్‌కి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూణె పిచ్ విషయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే భారత్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు వాషింగ్టన్ సుందర్ నైపుణ్యం తోడయ్యే అవకాశం ఉంది. రోహిత్ కూడా కుల్దీప్ స్థానంలో సుందర్‌ను ప్లే-11లో చేర్చవచ్చు.

జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్..

పేలవ ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.భారత్ తరపున గత 5 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. హోమ్ గ్రౌండ్‌లో గత 5 ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు 16, 22, 68, 0, 12. సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శన తర్వాత రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 150 పరుగులు చేశాడు. ఇప్పుడు అతడిని తప్పించడం రోహిత్ శర్మకు అంత సులభం కాదు. శుభ్‌మాన్ గిల్ ఫిట్‌గా మారాడు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో సర్ఫరాజ్, రాహుల్, గిల్‌లలో ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

రెండో టెస్టులో టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్/మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

Show Full Article
Print Article
Next Story
More Stories