IND vs BAN: తుఫాన్ విజయంతో సెమీస్ చేరిన భారత్.. 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లా

IND vs BAN: తుఫాన్ విజయంతో సెమీస్ చేరిన భారత్.. 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లా
x
Highlights

T20 World Cup 2024 IND vs BAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా తన రెండవ సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా రెండవ విజయం సాధించి సెమీ-ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.

T20 World Cup 2024 IND vs BAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా తన రెండవ సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా రెండవ విజయం సాధించి సెమీ-ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. తొలుత ఆడిన టీమిండియా 20 ఓవర్లలో 196/5 స్కోరు చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఓవర్ మొత్తం ఆడి 146/8 మాత్రమే చేయగలిగింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనింగ్ జోడీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 39 పరుగుల ఆరంభాన్ని అందించారు. షకీబ్ అల్ హసన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా షకీబ్ T20 ప్రపంచకప్ చరిత్రలో 50 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రిషబ్ పంత్‌తో కలిసి కోహ్లి 32 పరుగులు జోడించాడు. అయితే, అతను 28 బంతుల్లో 37 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ మౌనంగా ఉండి 2 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 24 బంతుల్లో 36 పరుగులు చేసి పంత్ కూడా ఔటయ్యాడు.

హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో భారత్‌ భారీ స్కోర్..

బంగ్లాదేశ్ బౌలర్లు పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34) శివమ్ దూబేతో కలిసి దాడి చేసి తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచడానికి కృషి చేశారు. హార్దిక్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ కూడా 3 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 197 పరుగుల లక్ష్యాన్ని అందించడంలో సఫలమైంది. బంగ్లాదేశ్‌ తరపున తంజీమ్‌ హసన్‌ షకీబ్‌, రిషాద్‌ హుస్సేన్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌కు ఐదో ఓవర్‌లో 35 పరుగుల స్కోరు వద్ద తొలి దెబ్బ తగిలి, 10 బంతుల్లో 13 పరుగులు చేసి లిటన్ దాస్ ఔటయ్యాడు. 31 బంతుల్లో 29 పరుగులు చేసిన తర్వాత తాంజీద్ హసన్ 66 పరుగుల వద్ద 10వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. 4 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి తౌహీద్ హృదయ ఫ్లాప్ అయ్యి ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

కాగా, షకీబ్ అల్ హసన్ 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో కూడా 40 పరుగులు చేసిన తర్వాత క్యాచ్ ఔట్ అయ్యాడు. రిషద్ హుస్సేన్ 10 బంతుల్లో 24 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతని ప్రయత్నాలు సరిపోలేదు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేసిన మహ్మదుల్లా కూడా అవుటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు.

సూపర్ 8లోని గ్రూప్ 1లో భారత్ 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా ఆస్ట్రేలియా 1 మ్యాచ్ తర్వాత 2 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ 1 మ్యాచ్‌లో ఓడి మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 2 మ్యాచ్‌లు ఓడి చివరి స్థానంలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories