IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ రద్దు..? BCCIపై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?

India vs Bangladesh Test Series
x

IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ రద్దు..? BCCIపై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?

Highlights

India vs Bangladesh Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

India vs Bangladesh Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా, రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది. అయితే ఈ సిరీస్‌పై అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస కారణంగా, భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌ను రద్దు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస జరుగుతోందని అభిమానులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో భారత్ క్రికెట్ ఆడకూడదంటూ బీసీసీఐపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువుల బాధలను బీసీసీఐ చూడటం లేదని అభిమానులు వాపోతున్నారు.

క్రికెట్ అంటే మాకు చాలా ఇష్టమని, అయితే భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సిరీస్‌లను చూడబోమని కొందరు అభిమానులు అంటున్నారు. ఒక మతానికి చెందిన వారిపై హింస జరిగే దేశంతో పోటీని మేం చూడమంటూ సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories