IND vs AUS 4th test Day 5: మెల్‌బోర్న్‌లో 5వ రోజు ఆటకు వర్షం అడ్డంకి కానుందా? వాతావరణం ఎలా ఉండనుంది?

IND vs AUS 4th test Day 5: మెల్‌బోర్న్‌లో 5వ రోజు ఆటకు వర్షం అడ్డంకి కానుందా? వాతావరణం ఎలా ఉండనుంది?
x
Highlights

IND vs AUS 4th test Day 5 Match Weather Report: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 4వ టెస్ట్ ఫలితం రేపటి 5వ రోజు జరిగే మ్యాచ్ పై ఆధారపడి...

IND vs AUS 4th test Day 5 Match Weather Report: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 4వ టెస్ట్ ఫలితం రేపటి 5వ రోజు జరిగే మ్యాచ్ పై ఆధారపడి ఉంది. 4వ రోజు ఆట ముగిసేటప్పటికి ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. సోమవారం టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగా ఇప్పుడు అందరి చూపు ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న మెల్ బోర్న్ వాతావరణంపై పడింది.

సోమవారం నాటి ఆటపై వర్షం ప్రభావం ఏమైనా ఉంటుందా ? లేక క్లీయర్ వెదర్ ఉంటుందా అని వెదర్ చెక్ చేస్తున్నారు. ఇప్పటికే వర్షం కారణంగానే మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. అందుకే 4వ టెస్ట్ మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందా అనేది క్రికెట్ ప్రియుల ఆందోళనగా కనిపిస్తోంది.

ఆక్యు వెదర్ రిపోర్ట్స్ ప్రకారం సోమవారం మొత్తం వాతావరణం ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సహకరించనుందనే తెలుస్తోంది. సోమవారం మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఉదయం వాతావరణం పొడిగా ఉంటూ ఉష్ణోగ్రతలు 25°C గా ఉండనుంది.

మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 27°C కు పెరుగుతుందని, అయినప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుందని సమాచారం. బౌలర్లకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రోజు మొత్తంలో వర్షం కురిసే అవకాశం 3 నుండి 5 శాతం వరకు మాత్రమే ఉందని అంచనాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ( Ind vs Aus 4th test Day 5) వచ్చే అడ్డంకేదీ లేదనే అనుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories