IND vs AUS 1st ODI : పోరాడి ఓడిన భారత్!

IND vs AUS 1st ODI  : పోరాడి ఓడిన భారత్!
x
Highlights

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో టీం ఇండియా జట్టు పోరాడి ఓడింది. అసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలలో ఎనమిది వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది.

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో టీం ఇండియా జట్టు పోరాడి ఓడింది. అసీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలలో ఎనమిది వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. దీనితో 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(90: 76 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(74: 86 బంతుల్లో 10ఫోర్లు) పోరాడినప్పటికీ ఇండియా జట్టుకు ఓటమి తప్పలేదు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపిన కేఎల్‌ రాహుల్‌(12), మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(2) దారుణంగా విఫలమయ్యారు. అటు కెప్టెన్ కోహ్లి (21) కూడా రాణించలేకోపోయాడు. ఇక అసీస్ జోష్‌ హేజిల్‌వుడ్‌(3/55), స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా(4/54) వరుస వికెట్లతో టీం ఇండియా జట్టును దెబ్బ తీశారు.

అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి గాను 374 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114:124 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌(105: 66 బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌(69: 76 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో తోడవ్వడంతో ఆసీస్‌ రికార్డు స్కోరు సాధించింది. ఇక ఎ దశలోనూ అసీస్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయలేకపోయారు భారత బౌలర్లు. మహ్మద్‌ షమీ ఒక్కడే మూడు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించగా, బుమ్రా, సైనీ, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో సిరిస్ లో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories