Virat Kohli: నేను బౌలింగ్ చేసుంటేనా.. రాజస్థాన్ రాయల్స్ 40కే ఆలౌట్.. కోహ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్..

Virat Kohli Sensational Comments On Rajasthan Royals
x

Virat Kohli: నేను బౌలింగ్ చేసుంటేనా..రాజస్థాన్ రాయల్స్ 40కే ఆలౌట్.. కోహ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్..

Highlights

Virat Kohli: ఆర్సీబీ సంబరాల వీడియో నెట్టింట వైరల్ కాగా కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదంగా మారాయి. ఈ మ్యాచ్ లో తాను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ జట్టు 40 పరుగులకే ఆల్ అవుట్ అయ్యేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

Virat Kohli: వివాదం లేకుండా క్రికెట్ నిస్తేజంగా ఉంటుంది. అయితే అవి శృతిమించితే ఆటకే ప్రమాదం..టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్ సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఈ సీజన్ లో కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేస్తున్నా..ఇతర ఆటగాళ్లతో వివాదాలు అతడి ఆటను డామినేట్ చేస్తున్నాయి. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తో కోహ్లీ గొడవ పడ్డాడు. ఈ విషయం పై సీరియస్ అయిన బీసీసీఐ కోహ్లీ మ్యాచ్ ఫీజు మొత్తాన్ని జరిమానాగా విధించింది. ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీతో కూడా కోహ్లీకి వివాదాలు ఉన్నాయి. ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అయింది. తాజాగా కోహ్లీ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు.

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో 112 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించినట్లయింది. ఈ విజయం ఆర్సీబీకి నూతనోత్సాహం ఇవ్వగా..మ్యాచ్ అనంతరం బెంగళూరు ప్లేయర్స్ తమ డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు.

ఆర్సీబీ సంబరాల వీడియో నెట్టింట వైరల్ కాగా కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదంగా మారాయి. ఈ మ్యాచ్ లో తాను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ జట్టు 40 పరుగులకే ఆల్ అవుట్ అయ్యేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కోహ్లీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన ఇద్దరు బౌలర్లు పార్నెల్, కర్ణ్ శర్మ చెలరేగడంతో ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. దీనికి కోహ్లీ ఇంతగా రెచ్చిపోవాలా అని కామెంట్స్ చేస్తున్నారు. మున్ముందు ప్లే ఆఫ్స్ ఉన్నాయి కదా ఆర్సీబీ అప్పుడేం చేస్తుందో చూద్దామంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేశాడు. 2008లో 2 వికెట్లు, 2011లో మరో 2 వికెట్లు వెరసి మొత్తం 4 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఇప్పటివరకు 235 మ్యాచులు ఆడిన కింగ్ కోహ్లీ 7,062 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 50 అర్థసెంచరీలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories