ICC Women's World Cup: విశ్వవిజేత న్యూజిలాండ్.. టీ20 ప్రపంచకప్ కివీస్ సొంతం

ICC Womens World Cup New Zealand beat South Africa by 32 runs
x

ICC Women's World Cup: విశ్వవిజేత న్యూజిలాండ్.. టీ20 ప్రపంచకప్ కివీస్ సొంతం

Highlights

ICC Women's World Cup: ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

ICC Women's World Cup: ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో తలపడ్డాయి. ఈ సమఉజ్జీల పోరులో కివీస్ విజేతగా నిలిచి పొట్టి కప్ చేజిక్కించుకుంది. టైటిల్ కోసం దుబాయ్ లో జరిగిన ఫైనల్స్ పోరు హోరాహోరీగా సాగింది. దక్షిణాఫ్రికాను కివీస్ టీం చిత్తుగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ తొలిసారి టీ-20 వరల్డ్ కప్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బౌలింగ్ లోను విఫలమైన సఫారీ జట్టు బ్యాటింగ్ లోనూ తడబడింది. లక్ష్యచేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగలకే ఆలవుట్ అయ్యింది. ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు మ‌రోసారి రన్నరప్ గా వెనుదిరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories