T20 World Cup: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది..

T20 World Cup: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది..
x
Image by Star Sports
Highlights

ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళా టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీఫైనల్ దశకు చేరుకుంది. లీగ్ దశ ముగియడంతో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ ఏలో భారత్...

ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఐసీసీ మ‌హిళా టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీఫైనల్ దశకు చేరుకుంది. లీగ్ దశ ముగియడంతో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ ఏలో భారత్ తోపాటు ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా సెమీస్ చేసింది. ఇక గ్రూప్ బీ నుంచి ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ చేరాయి. నాలుగు విజయాలతో ఘనంగా టోర్నీని ప్రారంభించిన భారత్ అన్ని జట్ల కంటే ముందుగానే సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఇక సెమీస్ తో భారత్ ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది.

ఈ టోర్నీ సెమీఫైలన్ లో భారత్ మహిళల జట్టుతో మాజీ చాంపియ‌న్ ఇంగ్లాండ్‌ తలపడనుంది. గ్రూప్‌-బిలో మంగ‌ళ‌వారం సౌతాఫ్రికా-వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దయింది. దీంతో ఇరుజ‌ట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో ద‌క్షిణాఫ్రికా అగ్రస్థానం ద‌క్కించుకుంది. ఇంగ్లాడ్ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈనేపథ్యంలో గ్రూప్‌-ఎ టాప‌ర్ భార‌త్‌తో గ్రూప్ బీలోని రెండోస్థానంలో ఉన్న జట్టు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియతో గ్రూప్ బీలో టాప్ జట్టు ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డ‌నున్నాయి.

అయితే గతంలోనూ సెమీస్‌లో మాజీ చాంపియ‌న్ ఇంగ్లాండ్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. 2018లో ఇదే సీన్ రిపీట్ కాగా.. అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఈ గురువారం మార్చి 5న సిడ్నీ వేదిక‌గా సెమీస్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. తొలి సెమీస్ భార‌త్‌-ఇంగ్లాండ్ మ‌ధ్య జరగనుంది. ఈసారి భారత్ ఇంగ్లాండ్ టీంపై ప్రతీకారం తీర్చుకోవాల‌ని భావిస్తోంది. సెమీస్ లో భారత్ విజయం సాధిస్తే తొలి సారి ఫైనల్ చేరిన జట్టుగా రికార్డుకెక్కుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories