ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన అశ్విన్‌, రో‌హిత్‌శర్మ, రిషభ్ పంత్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన అశ్విన్‌, రో‌హిత్‌శర్మ, రిషభ్ పంత్
x

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన అశ్విన్‌, రో‌హిత్‌శర్మ, రిషభ్ పంత్

Highlights

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్ములేపారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అశ్విన్, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌లు...

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్ములేపారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అశ్విన్, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌లు మెరుగైన ర్యాంకింగ్‌ సాధించారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాలో పైకి ఎగబాకారు.

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ దుమ్ములేపారు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్‌లో సెంచరీలతో కదం తొక్కిన రోహిత్​ శర్మ, రవిచంద్రన్​ అశ్విన్​లు తమ స్థానాలను మెరుగుపరుచుకోగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్స్‌లో రోహిత్ శర్మ​ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్ అగ్రస్థానంలో​ కొనసాగుతుండగా విరాట్​ కోహ్లీ తన 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమ్​ఇండియా యువ ఆటగాడు రిషభ్​ పంత్​ 11వ స్థానాన్ని పొందాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ ర్యాంక్. సెకండ్ ఇన్నింగ్స్​లో సెంచరీ చేసిన ఆల్​రౌండర్​ అశ్విన్​ బ్యాట్స్​మెన్​​ జాబితాలో ఏకంగా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 81వ స్థానంలో నిలిచాడు. 8 వికెట్లతో బౌలర్ల జాబితాలో 7వ స్థానం దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ ర్యాకింగ్స్‌లో మాత్రం అశ్విన్ 5వ స్థానం సంపాదించాడు​. ఆల్​రౌండర్ల జాబితాలో వెస్టిండీస్​ ఆటగాడు జేసన్​ హోల్డర్​ 407 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్​ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్ల ఘనత అందుకున్న స్పిన్నర్​ అక్షర్​ పటేల్​ 68వ స్థానంలో, కుల్​దీప్​ యాదవ్​ 50వ స్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories