ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో వీరే...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో వీరే...
x
Highlights

ఐసీసీ విడుదల చేసిన తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. రెండోవ స్థానంలో టీమిండియా 122...

ఐసీసీ విడుదల చేసిన తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. రెండోవ స్థానంలో టీమిండియా 122 పాయింట్లతో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ , పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో నిలిచారు. బ్యాటింగ్‌లో 895 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నాడు. మూడో స్థానంలో బాబార్ ఆజామ్ 834 పాయింట్లతో ఉన్నాడు. బౌలింగ్ లోనూ భారత్ జట్టు ఆటగాళ్లు టాప్ లో నిలిచారు. బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో చోటు దక్కించుకున్నాడు. 740 పాయింట్లతో న్యూజిలాండ్ ఆటగాడు బౌల్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్స్ జాబితాలో హార్థిక్ పాండ్య 10వ స్థానంలో నిలిచాడు.

జట్ల ర్యాంకింగ్స్ చూస్తే ‌:

ఇంగ్లాండ్, భారత్ , న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక,వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ టాప్ 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇక టీ20లో మాత్రం టీమిండియ ఐదో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌పై జరిగిన మూడు టీ20ల సిరీస్ లో భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ నెల 14 ఇండోర్ వేధికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు సారథి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహారించాడు. రెండు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. ఈ నెల 14 మొదటి టెస్టు, 22న రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్ బంగ్లా మధ్య ఈడెన్స్ గార్డెన్స్ వేధికగా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories