ఐసీసీ కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే

ICC announces Player of the month awards
x

ICC 

Highlights

అంతర్జాతీయ క్రికెట్ మండలి ‌(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌...

అంతర్జాతీయ క్రికెట్ మండలి ‌(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు' ఇవ్వనుంది. వన్డే, టీ20, టెస్టుల ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనకారులకు ఐసీసీ ఈ అవార్డులు ఇవ్వనుంది. ఐసీసీ ఓటింగ్‌ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రిడా అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు స్ఫష్టం చేసింది.

పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు ఓట్లను పరిగణంలోకి తీసుకుంటారు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, ఏడాదంతా ఆటగాళ్ల ప్రదర్శనలను పండుగలా జరుపుకునే గొప్ప మార్గంగా భావిస్తున్నాం' అని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ పేర్కొన్నారు.

మూడు ఫార్మాట్లలో‎ సాధించిన విజయాల ఆధారంగాను.. ముగ్గురు నామినీలను ఎంపిక చేసి ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు. ఈ నెలకు టీమిండియా నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఠాగూర్ తో పాటు సీనియర్ క్రికెటర్ స్పిన్నర్ అశ్విన్‌ పేర్లను పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories